News
News
వీడియోలు ఆటలు
X

Telangana: బీజేపీ ప్రచారం తిప్పికొట్టాలి! కాంగ్రెస్ కబుర్లకు చెక్ పెట్టాలి- BRS శ్రేణులతో మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పి కొట్టాల‌ని, కాంగ్రెస్ క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌కు చెక్ పెట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.  

FOLLOW US: 
Share:

Errabelli suggests BRS social media wing to fight against BJP and Congress: 
వరంగల్ : సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా బీజేపీ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పి కొట్టాల‌ని, కాంగ్రెస్ క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌కు చెక్ పెట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా మ‌రింత యాక్టివ్ గా ప‌ని చేయాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.  మంగళవారం  బిఆర్ఎస్  పాలకుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి దయాకర్ రావు హాజ‌ర‌య్యారు. 

సోషల్ మీడియా వారియర్స్ యాక్టివ్ గా ఉండాలి.. 
ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం లో 750 మంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నార‌న్నారు.  అందులో కొంద‌రు యాక్టివ్ గా లేర‌ని, వారు కూడా స‌మ‌ర్థంగా ప‌ని చేయాల‌ని సూచించారు. నియోజకవర్గంలో తాను మ‌చ్చ‌లేని నేత‌గా ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు. బిఆర్ ఎస్ పార్టీ గానీ, తాను గానీ, ఎలాంటి త‌ప్పు చేయ‌బోమ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు, యువ‌త స‌హ‌కారంతో తాను నిష్క‌ళంకంగా ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గం లో గ్రామానికి ఒకరి చొప్పున సోషల్ మీడియా కార్యకర్తలను ఎంపిక చేసి, వారిని సైనికుల్లా త‌యారు చేయాల‌ని సూచించారు. వారికి ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. వ‌చ్చే ఐదేళ్ళ‌ల్లో తాను పూర్తిగా పార్టీ కార్యక‌ర్త‌ల కోసం ప‌ని చేస్తాన‌ని చెప్పారు. నియోజకవర్గం లో పార్టీ పటిష్టంగా ఉందని, ఎదురేలేదని, రాబోయే ఎన్నికలలో గెలిచేది తానేన‌ని స్పష్టం చేశారు. 

తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచనలు 
సోషల్ మీడియా కార్యకర్తలు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, బీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. అయితే, గెల‌వ‌లేని ప్ర‌తిప‌క్షాలు బిఆర్ ఎస్ పార్టీ మీద‌, ప్ర‌భుత్వం మీద‌, సిఎం కెసిఆర్ మీద‌, త‌న మీద బుర‌ద చ‌ల్లి ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని, ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళ పెట్టి, అయోమ‌యానికి గురి చేస్తున్నాయ‌ని ఆరోపించారు. అలాంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పి కొట్టడంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియ‌ర్స్ జాగ‌రూక‌త‌తో కృషి చేయాల‌ని చెప్పారు. భవిష్యత్తులో సోషల్ మీడియా కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని అందుకు తగిన కార్యచరణ రూపొందించాలని సోషల్ మీడియా ఇంఛార్జ్ సూచించారు.  

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాలు 
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు దాన్యం నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని,  రైతులను అక్కున చేర్చుకొని ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. భారతదేశంలో పంట నష్టపోయిన రైతులకు ఎక్కడ సరిగా పరిహారం ఇవ్వడం లేదని కేవలం తెలంగాణలో మాత్రం ఎకరాకు పదివేల పరిహారం ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర ఇంఛార్జి వై సతీష్ రెడ్డి, సోష‌ల్ మీడియా చూస్తున్న యువ‌కులు, పార్టీ నాయకులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Published at : 03 May 2023 12:14 AM (IST) Tags: Farmers Errabelli Dayakar Rao BRS Telangana Palakurthi

సంబంధిత కథనాలు

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్‌ కాలేజీల నగరంగా వరంగల్‌: మంత్రి హరీష్

RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం

RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం

Eklavya Model Schools Results: ఏక‌ల‌వ్య గురుకుల విద్యాల‌యాల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌, డైరెక్ట్ లింక్ ఇదే!

Eklavya Model Schools Results: ఏక‌ల‌వ్య గురుకుల విద్యాల‌యాల ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !