Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజలకు పోలీసుల పట్ల భయం పోయిన నమ్మకం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తెలిపారు.
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, భరోసా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలోనే వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ వాహన ర్యాలీని దాస్యం వినయ భాస్కర్, వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ లతో కలిసి ప్రారంభించారు.
పెట్రోకార్స్, బ్లూకోల్ట్స్, అగ్నిమాపక వాహనాలు, షీ టీం, భరోసా, ఏఎన్టీయూ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన శకటాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసులు ఉత్సహంగా పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ప్రధాన ద్వారా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వరంగల్, ధర్మారం, ఓసీటీ, మామూనూర్, హంటర్ రోడ్, కాజీపేట్ ప్రాంతా సాగింది. ఈ సందర్భంగానే దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలోని అనేక శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.
ముఖ్యంగా పోలీసు శాఖలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమిస్తున్నారని పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో హోంగార్డు కొరకు అనేక ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి హోంగార్డులకు ఎన్నో రాయితీలను ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన అనంతరం దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ పోలీసుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కర ఉత్సహంగా పాల్గోని ఉత్సవాలను విజయవంతం చేయడం కృషి చేయాలని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగిడుతున్న వేళ ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈక్రమంలోనే నేడు పోలీస్ శాఖ సురక్షా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో పోలీసులు సాధించిన అభివృద్ధిని నివేదించడం కోసం ఈ కార్యక్రమం ఒక వేదికగా మారిందని అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా తెలంగాణలో కస్టోడియల్ మరణాలు అనేవి ఒక చరిత్రగా మారిందని, చట్టాలను కఠినంగా అమలు చేస్తూ, బాధితులు, సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉంటామని అన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా ఉంటామని.. ఇందుకోసం రాష్ట్రంలో పీడీ యాక్టు అమలులోకి తీసుకరావడం జరిగిందనని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం పోలీస్ శాఖకు మౌళిక సదుపాయలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా విభాగాలను ఏర్పాటు చేసి మహిళ భద్రకతు పెద్ద పీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ మున్సిపల్ కమీషనర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీలు మురళీధర్, కరుణాకర్, అబ్దుల్బారీ, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, ట్రైనీ ఐ.ఏ.ఎస్ శ్రద్ధా శుక్లా, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, హన్మకొండ ఫైర్ ఆఫీసర్, భగవాన్ రెడ్డి, అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు, ఆర్.ఐలు, ఇన్సెస్సెక్టర్లు, ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.