Minister Errabelli Lost His Mobile: సాధారణంగా ఎక్కడికైనా జన సమూహం ఉన్న చోటకు వెళ్లినా, రద్దీ ఉన్నచోట మొబైల్ పోయింది, పర్సు పోయింది అనే మా వింటుంటాం. అయితే తాజాగా తెలంగాణ మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది.


మైక్ లో మాజీ డిప్యూటీ సీఎం అనౌన్స్ మెంట్ 
స్టేషన్ ఘన్ పూర్, శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తన సెల్ ఫోన్ లేదని గుర్తించారు. తన సెల్ ఫోన్ పోయిందని మంత్రి తన గన్ మెన్లకు తెలిపారు. Sri Bugulu Venkateswara Swamy Temple కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మొబైల్ పోయిందని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మైక్ లో అనౌన్స్ చేయడంతో భక్తులందరూ ఆశ్చర్యపోయారు.



రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, చాలీచాలని జీతంతో ఎంతో మంది కష్టాలు పడుతుంటారు. చిన్న అవసరమో, పెద్ద కష్టమో, పిల్లల స్కూలు ఫీజులనో ఏదో కారణంతో మనలో చాలా మంది అప్పులు చేస్తూనే ఉంటాం. అయితే చేసిన అప్పులే కాదు వాటి వడ్డీ కట్టకుండా ఉడాయించే వారు కొందరైతే.. నిజాయితీగా అప్పులను తీర్చే మార్గాన్ని వెతికే వారు కూడా ఉంటారు. అయితే ఈ అప్పులను తీర్చాలంటే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు ఉన్నాడని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అప్పుల సమస్యతో బాధపడేవారు స్టేషన్ ఘన్ పూర్ లోని శ్రీ గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు.


హైదరాబాద్ వరంగల్ రహదారిలో చిల్పూరు గుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం అని ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె వేసి భక్తితో దీపం వెలిగిస్తే అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారని, మన కష్టాలు కొన్నైనా తీరుతాయని స్వామి వారి భక్తులు భక్తులు విశ్వసిస్తారు. ఆయన వివాహానికి సైతం వెంకటేశ్వరస్వామి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నారని పురాణాలలో ఉంది. తాను చేసిన అప్పులను ఎలా తీర్చాలి, అని స్వామివారు గుబులుగా ఉంటారని.. ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చిల్పూరు గుట్టకు వచ్చి తపస్సు చేశారట. అందుకే ఇక్కడ వెలసిన స్వామి వారిని శ్రీ గుబులు వేంకటేశ్వర స్వామిగా పిలుచుకుంటారు.