Pawan kalyan: కాపీ కొట్టలేదు, నిజాయితీగా పరీక్ష రాసి ఇంటర్ ఫెయిలయ్యా: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan kalyan: తాను ఇంటర్ పరీక్షల్లో కాపీ కొట్టకుండా.. నిజాయితీగా రాసి ఫెయిల్ అయ్యానని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

Continues below advertisement

Pawan kalyan: వరంగల్ నిట్ లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వరంగల్ లోని జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా స్టేజీపై ప్రసంగిస్తూ తన విద్యాభ్యాసం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తన జీవితంలో బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పంచుకుంటూ తన ఇంటర్మీడియట్ పరీక్షల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్. తాను ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో తన తోటి విద్యార్థులు, స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లి పరీక్షలు రాస్తున్నా.. తాను మాత్రం చిటీలు పట్టుకెళ్లలేదని చెప్పాడు పవన్ కళ్యాణ్. పరీక్షల్లో తాను ఫెయిల్ అయినా సరే కానీ కాపీ కొట్టకూడదన్న భావనతో.. నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ లో ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను పరీక్షలు ఉత్తీర్ణత సాధించకపోయినా నైతికంగా మాత్రం విజయం సాధించినట్లు తెలిపారు పవన్. 

Continues below advertisement

తాను ఎప్పుడూ విద్యా సంస్థ కార్యక్రమాలకు పెద్దగా వెళ్లనన్న చెప్పిన పవన్.. జాతీయ సాంకేతిక విద్యాసంస్థల గురించి మాట్లాడుతూ.. నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని ప్రశంసించారు. వరంగల్ ఎన్ఐటీలో చదువుతున్న వారు.. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు పవన్. జీవితంలో పరాజయాలు ఎదురవుతాయని, కానీ రేపు కచ్చితంగా విజయం అందుకుంటారని సూచించారు. కల.. వివిధ ప్రాంతాల వారిని కూడా కలుపుతుందని, దానికి నాటు నాటు పాటనే నిదర్శనమని చెప్పారు పవన్. నాటు నాటు పాట ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుందని, ప్రతి ఒక్కరూ పాదం కలిపేలా చేసిందని చెప్పుకొచ్చారు. మనందరిని కలిపేది సాంస్కృతి అంటూ పవన్ ప్రసంగించారు. తాను కాలేజీలు, యూనివర్సిటీలకు అంతగా వెళ్లలేదన్నారు. అయితే తాను నిత్య విద్యార్థినని, జీవితం నుంచి ఎంతో నేర్చుకుంటున్నా అన్నారు.

Continues below advertisement