అన్వేషించండి

Maoist News: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఆపరేషన్ కగార్‌-2, రెండు వేల మంది బలగాలతో అగ్రనేతల కోసం వేట!

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Maoist News: దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ మిషన్ -2026 గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్ కగార్‌ను పునఃప్రారంభించాయి. ఈసారి కర్రె గుట్టల హిల్స్‌ను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. అందుకే దీనికి ఆపరేషన్ కేజీహెచ్‌-2ను ప్రారంభించాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెండు వేల మంది సాయుధ బలగాల మోహరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీప్రాంతాల్లో అగ్రనేత బడే చొక్కారావు, అలియాస్‌ దామోదర్‌తోపాటు బడానేతలు సంచరిస్తున్నారనే సమాచారరంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 

అగ్రనేతలే లక్ష్యంగా  భారీ వ్యూహం

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది. సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కేజీహెచ్‌-2 చేపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నంబి ప్రాంతం నుంచి వ్యాపించి ఉన్న కర్రెగుట్టల అడవుల్లో ఈ వేట కొనసాగిస్తున్నారు. 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జి అలియాస్‌ చేతన్, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధీ, బడే చొక్కారావులాంటి పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా రెండు వేలకుపైగా బలగాలతో అడవిలో అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్‌లలో ఇదే ర్రెగుట్టల్లో నిర్వహించిన 21రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చారు. కానీ అగ్రనేతలు మాత్రం తప్పించుకున్నారు. ఈసారి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే పట్టుదలతో బలగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తడపల, పామునూరు, మురుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో నిరంతర నిఘా పెట్టార. 

ఉమ్మడి వరంగల్ సరిహద్దుల్లో దామోదర్‌ కోసం వేట 

తెలంగాణలోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్ షెల్టర్ తీసుకున్నారని పక్కా సమాచారం అందింది. అందుకే ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దామోదర్‌ స్వస్థలమైన తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ గ్రామం నుంచి కీలక సమాచారం బయటకు వెళుతుందని అనుమానంతో నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం వంటి ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. 

గ్రేహౌండ్స్‌- ఎస్ఐబీ రంగ ప్రవేశం 

రాష్ట్రంలోని అత్యంత శక్తిమంతమైన నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు మ తాత్కాలిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.                                      

Frequently Asked Questions

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనకు ఏ గడువును నిర్దేశించుకుంది?

కేంద్ర ప్రభుత్వం దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచి పెట్టడానికి మిషన్ -2026 గడువును నిర్దేశించుకుంది.

ప్రస్తుతం భద్రతా బలగాలు ఏ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి?

భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 'ఆపరేషన్ కేజీహెచ్-2'ను పునఃప్రారంభించాయి. ఈసారి కర్రె గుట్టల హిల్స్‌ను టార్గెట్ చేసుకున్నాయి.

ఆపరేషన్ కేజీహెచ్-2 లో ఏయే ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు?

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నంబి ప్రాంతం నుంచి వ్యాపించి ఉన్న కర్రెగుట్టల అడవుల్లో, అలాగే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీప్రాంతాల్లో ఈ వేట కొనసాగుతోంది.

ఏయే మావోయిస్టు అగ్రనేతలను లక్ష్యంగా చేసుకున్నారు?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జి అలియాస్‌ చేతన్, బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధీ, మరియు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ లాంటి పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Embed widget