అన్వేషించండి
Karregutta Encounter: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్- మావోయిస్టు అగ్రనేతలు హతం!
Karregutta Encounter: కర్రెగుట్టలో భారీగా బలగాలు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్- మావోయిస్టు అగ్రనేతలు హతం!
Source : PTI
Karregutta Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు హతమైనట్టు సమాచారం అందుతోంది. మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు వేగవంతం చేసింది. టార్గెట్‌కు ఇంకా నలభై రోజులే గడువు ఉన్నందున ఆపరేషన్ కగార్‌ను ముమ్మరం చేసింది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడే ఉన్న మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇంకా చదవండి
Advertisement























