తెలంగాణలో మొదటి సారిగా హోం ఓటింగ్ చేస్తున్నామని, 80 ఏళ్లు పైబడిన వారు, పీడబ్ల్యూడీ (దివ్యాంగులు), అత్యవసర సేవల్లో ఉన్నవారు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను రెడీ చేశామని చెప్పారు. ఈసారి ఓటరుకు ఓ బుక్ లెట్ ఇస్తున్నామని, దానిపై బ్యాలెట్ సెట్ ను ఎలా వాడాలో వివరించి ఉంటుందని చెప్పారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ కూడా మరో రెండు రోజుల్లో పూర్తి అవుతుందని చెప్పారు. పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన గురువారం (నవంబర్ 23) వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం 60 మంది కాస్ట్ అబ్జర్వర్లను నియమించినట్లుగా కమిషనర్ వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని చెప్పారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ సారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి తపాలాశాఖ ద్వారా పంపిణీ చేశామని చెప్పారు. ఈ పంపిణీ ఆఖరి దశలో ఉందని, ఎన్నికలలోపు వాటిని పూర్తిగా పంపిణీ చేస్తామని తపాలాశాఖ వారు హామీ ఇచ్చారని చెప్పారు. మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామని.. ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వికాస్ రాజ్ వివరించారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని.. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకులు ఉంటారని వివరించారు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ వివరించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply