Vote for Note Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న నామినేటెడ్‌‌ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా వినాలని, అదనపు వాదనలు వినిపించే అవకాశం తనకు కల్పించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.  

Continues below advertisement

అసలేంటి కేసు? 

ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, కాబట్టి కేసు చెల్లదని రేవంత్‌రెడ్డి 2021 జూలై 22న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య సైతం 2021 ఏప్రిల్‌ 13న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది.

తాజాగా ఈ పిటిషన్లు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చినప్పుడు, స్టీఫెన్‌‌సన్‌ తరఫు న్యాయవాది ఇంప్లీడ్‌ పిటిషన్‌ను గురించి ప్రస్తావించారు. ఫిర్యాదుదారుడిగా తన వాదనలు వినడం న్యాయపరంగా ఎంతో కీలకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తూ, కేసు విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.   Also Read: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

Continues below advertisement

2015లో

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణలో 2015 మే నెలలో శాసనమండలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి సంఖ్యాబలం లేవు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్‌. స్టీఫెన్‌సన్‌‌ను తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి, ఆయన సహచరులు స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లి రూ. 50 లక్షల నగదుతో వెళ్లారు.  దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు అక్కడ రేవంత్‌రెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. ఈ సమయంలో రేవంత్‌రెడ్డి మాట్లాడిందంతా, వీడియోలు, ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.  Also Read: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!