Bandi Sanjay: డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్, ఆ దారుణ ఘటనపై ఆరా

Telangana News: జైనూర్ ఆదివాసీ మహిళపై షేక్ మగ్దూం లైంగికదాడి ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. 31న ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణాలపై అడిగి తెలుసుకున్నారు.

Continues below advertisement

Bandi Sanjay calls DGP: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు డీజీపీ జితేందర్ కు ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Continues below advertisement

ఈనెల 31న జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతోపాటు తీవ్రంగా గాయపర్చడంతోపాటు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ ఆదివాసీ మహిళ కేసు పూర్వాపరాలను, ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాల అడిగి తెలుసుకున్నారు. 

ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Continues below advertisement