TGSRTC Recruitment 2025 | హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఇటీవల ఓ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా టీజీఎస్ ఆర్టీసీ మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు డ్రైవర్, శ్రామిక్ (Mechanic Helper) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

TGSRTC Notification 2025 – పోస్టుల వివరాలుఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 8న ప్రారంభం కాగా, అక్టోబర్ 28తో తుది గడువు ముగియనుంది. 

ఖాళీల వివరాలు-  డ్రైవర్ పోస్టులు: 1000-  శ్రామిక్ పోస్టులు: 743-  మొత్తం ఖాళీలు: 1743

ఈ పోస్టులను జిల్లాల వారీగా కేటాయించారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ PDFలో అందుబాటులో ఉంటుంది.

డ్రైవర్ పోస్టుకు విద్యార్హతలు:- 10వ తరగతి పాస్ అయి ఉండాలి- హెవీ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి- డ్రైవింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం

శ్రామిక్ పోస్టులకు విద్యార్హతలు:-  10వ తరగతి లేదా ఐటీఐ (Mechanic/Auto Trades) పూర్తి చేసి ఉండాలి

ఏజ్ లిమిట్డ్రైవర్ పోస్టులకు: కనీస వయసు: 22 సంవత్సరాలుగరిష్ట వయసు: 35 సంవత్సరాలు

శ్రామిక్ పోస్టులకు: కనీస వయసు: 18 సంవత్సరాలుగరిష్ట వయసు: 30 సంవత్సరాలు

వయోపరిమితి సడలింపు: ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు-  డ్రైవర్ పోస్టులు: నెలకు ₹20,960 – ₹60,080 -  శ్రామిక్ పోస్టులు: నెలకు ₹16,550 – ₹45,030 నెలకుపోస్టు, అనుభవం, పనితీరు ఆధారంగా జీతం నిర్ణయిస్తారు

దరఖాస్తు ఫీజుడ్రైవర్ పోస్టులకు: ఎస్సీ / ఎస్టీ: ₹300 చెల్లించాలిఇతరులు: ₹600

శ్రామిక్ పోస్టులకు: ఎస్సీ / ఎస్టీ: ₹200 చెల్లించాలిఇతరులు: ₹400

అభ్యర్థులు ఆన్లైన్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియవిద్యార్హత ఆధారంగా మెరిట్ లిస్ట్

డ్రైవర్ పోస్టులకు: డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఇలా దరఖాస్తు చేసుకోండి-  అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in  ను సందర్శించాలి-  Recruitment 2025 సెక్షన్ లోకి వెళ్లి, కావలసిన పోస్టును ఎంచుకోవాలి-  తరువాత Apply Online పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.-  పోస్టుకు కావాల్సిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.-  అప్లికేషన్ ఫీజు చెల్లించి Submit మీద క్లిక్ చేయండి.-  చివరగా, అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.