Telangana RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. త్వరలోనే 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వీటిలో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలతోపాటు పలు పోస్టులు ఉంటాయని వెల్లడించారు.
డ్రైవర్ పోస్టులు– 2000శ్రామిక్ –743డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) – 114డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) – 11అకౌంట్ ఆఫీసర్స్ – 6మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7
ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ నోటిఫికేషన్ ఆలస్యమైందని.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రజా పాలన ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమయ్యిందని పేర్కొన్నారు.
165 కోట్ల ఉచిత ప్రయాణాలురేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే మహా లక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయ్యిందని పేర్కొన్నారు.