TPCC Meeting: తెలగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాల పరంపర కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్ నాయకులు అసమ్మతిని కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పదవులు కట్టబెట్టారని శనివారం సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఆదివారం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు సీనియర్ నాకుల వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 12 మంది ఆదివారం పీసీపీ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఎమమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. 


సమావేశం ప్రారంభంలో కాసేపు వాదోపవాదాలు..


వచ్చే నెల 26వ తేదీన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాథ్ సే హాథ్ అభియాన్ పేరిట చేపట్టనున్నారు. ఈక్రమంలోనే  యాత్రకు సన్నాహకంగా రేవంత్ రెడ్డి ఆదివారం గాంధీ భవనలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. వీటన్నిటిపై చర్చ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, జగ్గారెడ్డి, మధుయాస్కీ, మహేశ్వర్ రెడ్డి సహా శనివారం భట్టి నివాసంలో భేటీ అయిన నాయకులు అందరూ ఆదివారం నాటి సమావేశంలో పాల్గొనలేదు. ఆదివారం నాటి సమావేశం ప్రారంభంలో కొంత సేపు వాదోపవాదాలు జరిగాయి. 


జోడో అభియాన్ యాత్రపై స్పందించిన నేతలు..


ఇతర అంశాలపై చర్చ వద్దని క్రమశిక్షణ సంఘం నాయకుల మధ్య వాగ్వివాదాలు తలెత్తడంతో సీనియర్ నేత జానారెడ్డి సముదాయించారు. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ప్రయాంక గాంధఈ చేపట్టే హాథ్ సే బాథ్ జోడో అభియాన్ యాత్ర ఏర్పాట్లుపై మాత్రమే చర్చిద్దామని పొన్నం ప్రభాకర్, మల్లు రవి, నాగం జనార్దన్ రెడ్డి, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, చెరకు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘఆల ఛైర్మన్లు పాల్గొన్నారు. 






శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మానవతా రాయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డని వలసవాది అంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎవరి సొత్తు కాదని, సీనియర్ నాయకులు తమ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరించవద్దని కోరారు. పార్టీలో అన్ని సమస్యలకు అధిష్ఠానమే పరిష్కారాన్ని సూచిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల ముందు తాను ఎదుర్కుంటున్న సమస్యలు పెద్దవి కావని తెలిపారు. తాను కూడా జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.