By: ABP Desam | Updated at : 30 Aug 2023 02:26 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 30 August 2023:
సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు-కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశాలు నిర్వహించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వినాయకచవిత తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను 10 రోజుల నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని భావింస్తోంది అధికార పార్టీ. మరోవైపు, వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. సెప్టెంబరు రెండోవారంలో సమావేశాలను నిర్వహించాలని ముందుగా భావించారు. కానీ సీఎం జగన్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్తున్నారు. పూర్తి వివరాలు
తెలంగాణలో ఎన్నికల వలసలు - ఎవరెవరు ఏ పార్టీలోకి మారుతున్నారంటే ?
తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు ప్రాధాన్యం లభించే పార్టీల్లోకి మారిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేత సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలి వరకూ వారు టీడీపీలో ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత దయాకర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల చనిపోయారు. మక్తల్ , దేవరకద్ర నియోజకవర్గాల నుంచి దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి ఒకే సారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర అవిర్భావం తర్వాత కూడా కొనసాగినప్పటికీ ఇటీవల రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలనుకున్నారు. పూర్తి వివరాలు
50శాతం గ్యారంటీ పింఛన్‌తో జీపీఎస్-ఉద్యోగ సంఘాల మధ్య వివాదం
జీపీఎస్‌పై కసరత్తు చేస్తున్న ఏపీ సర్కార్.. త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. పీఆర్‌సీ ఉద్యోగి కంట్రీబ్యూషన్ మినహా మిగిలిన అన్ని ప్రయోజనాలు ఇస్తామని చెప్తోంది. అయితే, జీపీఎస్‌లో మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. దీనిపై అద్యయనం చేసిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కార్ చెప్తోంది. మరోవైపు... జీపీఎస్‌ను కొన్ని ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తే... మరికొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. జీపీఎస్‌పై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్... 50శాతం పింఛన్ గ్యారంటీతో పాటు పలు ప్రయోజనాలు అందిస్తామని చెప్తోంది. పూర్తి వివరాలు
గోరంట్ల మాధవ్‌కు ఈ సారి టిక్కెట్ లేనట్లేనా ? సైలెంట్ అయిపోయిన ఎంపీ !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ది ఓ ప్రత్యేకమైన స్టోరీ. పోలీసు అధికారిగా ఉంటూ అధికార పార్టీ నేతల మీద మీసం మెలెసి.. తొడకొట్టి ప్రతిపక్ష పార్టీని మెప్పించి ఏకంగా ఎంపీ టిక్కెట్ పొందారు. అంతే కాదు ఘన విజయం సాధించారు కూడా. కానీ ఐదేళ్లయ్యేసరికి ఆయనకు రాజకీయం గడ్డు కాలం వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లబిస్తుందా లేదా అన్న డైలమాలో పడిపోయారు. సీఎం జగన్ ను చాలా సార్లు కలిసినా... మళ్లీ నీకే టిక్కెట్ అనే భరోసా దక్కలేదు. అదే సమయంలో.. ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా చాన్సిస్తారేమోనని ఎదురు చూస్తున్నా.. ఇంత వరకూ అలాంటి సంకేతాలు రాకపోవడంతో.. మాధవ్ కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. పూర్తి వివరాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు- అధికారులతో ఎన్నికల సంఘం సమావేశాలు
తెలంగాణలో ఎన్నికల కసరత్తు మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతుండటంతో... రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏర్పాట్లకు రెడీ అయ్యింది. శాసనసభ ఎన్నికల కోసం అధికారులు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్... అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీతో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలింగ్ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. పూర్తి వివరాలు
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
KTR in Mancherial: మంచిర్యాల జిల్లాకు కేటీఆర్ - పర్యటన వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బాల్క సుమన్
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>