సిట్ ఏర్పాటు చట్టబద్దమేనా? సిబిఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్పగించడం కరెక్టేనా? నేడు హైకోర్టు లో విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కింది. సిబిఐ కి కేసును బదిలీ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. 74 అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు అప్పీళ్లు దాఖలు చేయగా మరో రెండు అప్పీళ్లు ఇవాళ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. సిట్ దర్యాప్తును పక్కన పెట్టడం సరికాదని ప్రభుత్వం అప్పీల్ పేర్కొంది. మరోవైపు నిందితులు సిఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం తన అప్పీల్ పూర్తి వివరాలు సబ్మిట్ చేసింది. సిట్ రద్దు చేసి దర్యాప్తును సిబిఐకి ఇవ్వడం చట్టవ్యతిరేకరమనీ, సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి సిట్ దర్యాప్తు కొనసాగించాలని ప్రభుత్వం తన అప్పీల్ లో కోరింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
నేటి నుంచి 7 వరకు టీచర్లకు వర్క్ షాప్
రాష్ట్రంలో ఎంపికైన పలు వురు టీచర్లకు నేటి నుంచి 7 వరకు 'జెండర్ విత్ రిసోర్స్ సపోర్ట్' అంశంపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన తెలిపారు. హెచ్సీయూ సెంటర్ ఫర్ వుమెన్ స్టడీస్ నేతృత్వంలో హైదరా బాద్ జూబ్లీహిల్స్లోలోని ఎంపీఆరొచ్చార్డీలో ఈ వర్క్ షాప్ ఉంటుందని పేర్కొ న్నారు. 33 జిల్లాల నుంచి ఒక పురుష టీచర్ను, మరో మహిళా టీచర్ను ఈ వర్క్ షాప్ కు ఎంపికచేశారు.
నేటి నుంచి టీజీయూజీసెట్ కు దరఖాస్తులు
ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు టీబీయూజ్ సెట్ నిర్వహిస్తున్నట్టు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ పరీక్షకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకు వచ్చే మార్చిలో ఇంటర్ పూర్తి చేసే విద్యార్థులు అర్హులని తెలిపారు. విద్యార్థుల తలిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ 2 లక్షలు ఉండాలని పేర్కొన్నారు. వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in లేదా https://www. tswreis.ac.inని సంప్రదించాలని సూచించారు.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీల కార్యదర్శి రొనాల్డ్ రాస్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. గురుకుల సొసైటీల వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.
నేడు తేలికపాటి వర్షాలు!
దేశ ఆగ్నేయ ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.