Breaking News: బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఉత్పత్తి: ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ, సినీ, బిజినెస్, స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం.
LIVE

Background
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేరళ కాంగ్రెస్ నేత వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరువనంతపురం బయలుదేరి వెళ్లారు. మే 18 ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో కేరళ నూతన ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరుకానున్నారు.
క్రీడా, యువజన వారోత్సవాలు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యువజన, క్రీడా వారోత్సవాలు కార్యక్రమాన్ని ఉదయం 6 గంటలకు ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి ప్రభుత్ ముఖ్య కార్యదర్శి జయష్ రంజన్ లతో కలిపి ప్రారంభిస్తారు
టెన్నిస్ కాంప్లెక్స్ లో ఉదయం 6 గంటలకు మెగా జుంబా కార్యక్రమం ఆ తదుపరి ఐదు కిలోమీటర్ల వక్ థాన్ కార్యక్రమము, ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగే యోగ మెడిటేషన్ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొంటారు. ఎల్ బి టెన్నిస్ కాంప్లెక్స్ వద్ద మంత్రులు వాకిటి శ్రీహరి పొన్నం ప్రభాకర్లు జండా ఊపి ప్రారంభించే వాకథాన్ కార్యక్రమంలో దాదాపు 2000 పైగా యువ క్రీడాకారులు పాల్గొని 5kవాకతాన్ కార్యక్రమం ఎల్బీ స్టేడియం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం బురుగుల రామకృష్ణారావు భవనం ఈగల్ సర్కిల్ ఆర్బీఐ అసెంబ్లీ కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్బీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుంది. తదుపరి ఎల్బి స్టేడియంలో దివ్యాంగులకు మహిళలకు సీనియర్ సిటిజన్స్ కు యోగ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహింపబడుతుంది.
వితంతువులకు కొత్త పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన 'ప్రజాదర్బార్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రజాదర్బార్ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 12వ తేదీ నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం లబ్ధిదారులు త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేలా ప్రభుత్వం తగిన అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, వైఫల్యాల వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూగర్భ, రెవెన్యూ వివాదాలను మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి అర్జీని సానుకూలంగా పరిశీలించి, బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో గోవిందరాజన్ భేటీ
తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ప్రాజెక్టును బుల్లెట్ వేగంతో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం అమరావతిలో సంస్థ సీఈవో గోవిందరాజన్ ఆయనతో భేటీ అయ్యారు. రూ.2,500 కోట్ల పెట్టుబడితో, ఏటా 9 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యంతో వచ్చే ఈ ప్లాంట్ ద్వారా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రతిపాదిత 24 నెలల గడువుకు బదులు, 18 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం సూచించారు.
2 తలల పాముల విక్రయంపై డీఆర్‌ఐ డెకాయ్ ఆపరేషన్.. వరంగల్‌లో నిందితుడి అరెస్ట్!
2 తలల పాములుగా పిలిచే అరుదైన 'రెడ్ సాండ్ బోవా' (ఇసుక తిన్నె పాములు) అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు వరంగల్‌లో మెరుపు దాడి చేశారు. ఈ పాములను విక్రయించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. కస్టమర్ల రూపంలో వెళ్లిన డీఆర్‌ఐ బృందం (డెకాయ్ ఆపరేషన్ ద్వారా) నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి సజీవంగా ఉన్న రెండు ఇండియన్ రెడ్ సాండ్ బోవా పాములను స్వాధీనం చేసుకుంది.

బ్లాక్ మార్కెట్‌లో కోట్ల రూపాయల ధర!ఈ తరహా పాములకు అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉంది. వీటి విలువ దాదాపు రూ. 2 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమాజంలో ఉన్న మూఢనమ్మకాల ప్రకారం.. క్షుద్ర పూజలు చేయడానికి, అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకంతో పాటు కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీ కోసం వీటిని అక్రమంగా విపరీతమైన ధరలకు కొనుగోలు చేస్తుంటారని విచారణలో వెల్లడైంది. పట్టుబడిన నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న పాములను, ప్యాకింగ్ సామగ్రిని తదుపరి చర్యల నిమిత్తం వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు డీఆర్‌ఐ అప్పగించింది.
ట్రెండింగ్ వార్తలు





















