Vijayawada to Hyderabad Bus News | హైదరాబాద్: తెలంగాణ హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే బస్సులకు TGSRTC ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసులు, ల‌హరి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్ లో 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ తెలిపింది. అలాగే రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎవరైనా టీజీఎస్ఆర్టీసీ టికెట్ ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ http://tgsrtcbus.inని సందర్శించాలని సూచించారు. ఇటీవల బెంగళూరుకు వెళ్లే బస్సులకు సైతం 10 శాతం రాయితీ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. 


 






బెంగళూరుకు వెళ్లే బస్సులకు సైతం 10 శాతం రాయితీ
తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ చల్లని కబురు చెప్పింది. బెంగళూరు మార్గంలో రాకపోకలకు టికెట్ ధరలో 10 శాతం రాయితీని TGSRTC కల్పిస్తోంది. ఈ రాయితీ అనంతరం ఒక్కొక్కరికి రూ.100 నుంచి 160 రూపాయల వరకు ఆదా అవుతుంది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ పది శాతం రాయితీ వర్తిస్తుందని ఇటీవల సజ్జనార్ తెలిపారు. 


Also Read: Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా