AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు ఏపీలో పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ చిరుజల్లులు పడ్డాయి. అసని తుఫాన్ ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల కిందట అసని తుఫాన్ తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద  తీరాన్ని దాటింది. ఆ సమయంలో అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురిశాయి.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..(Temperature in Andhra Pradesh)
అసని తుఫాన్ ప్రభావం ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఇంకా తగ్గలేదు. వాతావరణం పొడిగా మారినా, వారం రోజుల కింద ఉన్నంత ఎండలు, పగటి ఉష్ణోగ్రత ఇప్పుడు లేవని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు సైతం పగటి ఉష్ణోగ్రత 40 దిగువన నమోదు కానున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒకట్రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తీరంలో 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముంద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారింది. నేటి నుంచి ఇక్కడ ఎండలు మండిపోనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొది. అనంతపురంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 38.2 డిగ్రీలు, కడపలో 38 డిగ్రీల మేర నమోదు కాగా, ఆరోగ్యవరంలో కేవలం 34 డిగ్రీలు ఉంది. తేమ, ఉక్కపోత అధికంగా ఉండనుంది కనుక ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదు. అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని సూచించారు.






తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..(Temperature in Telangana)
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఎండలు కొనసాగనున్నాయి. నేటి (ఈ నెల 26) నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సూచించారు. అత్యధికంగా మెదక్‌లో 39.6 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 39.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 38.5 డిగ్రీలు, దుండిగల్‌లో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: Horoscope Today 26th March 2022: ఈ రాశివారి కెరీర్ దూసుకెళుతుంది, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి