Telangna Elections 2023 :  ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న  జలగం వెంకటరావుకు ( Jalagam Venkat rao ) ఏ పార్టీలో టిక్కెట్ దొరకకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ెస్ పార్టీలో ఉన్నారు.   మాజీ ముఖ్యమంత్రి  జలగం వెంగళరావు చిన్న కుమారుడే ఈ జలగం వెంకటరావు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపు నుంచి ఖమ్మంలో గెలిచిన ఏకైక అభ్యర్థి ఆయనే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress )అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే తర్వాత ఆయన బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. దీంతో జలగం వెంకట్రావుకు బీఆర్ఎస్‌లో నిరాదరణ ఎదరుయింది.                                 


వనమా  వెంకటేశ్వరరావు ( vanama venkateswar rao )  తప్పుడు అఫిడవిట్ సమర్పించారని   ఆయన గెలుపును సవాల్ చేస్తూ..  హైకోర్టులో పిటిషన్ వేశారు.  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చింది.. అయితే, వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి హై కోర్టు నిర్ణయంపై స్టే తెచ్చుకున్నార.ు 


 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల తేడాతో గెలుపొందారు  వెంకటరావు 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఖమ్మం  నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో.. ఆయన బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ దక్కలేదు.                                    


ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆయనకు కొత్తగూడెం టిక్కెట్ ఇచ్చేందుకు  కాంగ్రెస్ కూడా ఆసక్తి చూపించింది. కానీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నందున జలగంను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోలేదు. చివరికి ఆ సీటును సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఇప్పుడు జలగం వెంకట్రావు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎవరికి  నష్టం జరుగుతుందన్నదానిపై కొత్త గూడెం రాజకీయాల్లో ఆసక్తి ఏర్పడింది.