Telangana Rising Summit Sucess : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. భారీ విజయాలు నమోదు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఐదు లక్షల కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చినట్లుగా చెప్పింది. అయితే పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్న సంస్థలు అత్యధికం దేశీయ పరిశ్రమలే. ట్రంప్ కంపెనీ తప్ప అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదన్న భావన ఎక్ుకవగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెండు నెలల నుంచి రోజూ ఈ సమ్మిట్ గురించే మాట్లాడుతూ వచ్చారు. దాంవోస్ లాంటిది, ప్రపంచం మొత్తం చూస్తుందని చెబుతూ వచ్చారు. కానీ ఈ సమ్మిట్ కు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, సామ్‌సంగ్ వంటి వాటి నుంచి ఎవరూ రాలేదు.
సమ్మిట్ లో పాల్గొనేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించలేకపోయిన ప్రభుత్వం
సమ్మిట్ లక్ష్యం 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటారని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి అంతర్జాతీయ పాల్గొనేవారు కనిపించలేదు. వేదికలు ఖాళీగా కనిపించాయి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, మెటా, సామ్‌సంగ్, ఫాక్స్‌కాన్, షెల్, GE, సిమెన్స్ వంటి టాప్ MNCs లేవు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, సావరిన్ హెల్త్ ఫండ్స్ కు చెందిన సంస్థలు దూరంగా ఉన్నాయి. అనంద్ మహీంద్రా, చిరంజీవి, దిల్ రాజు, అల్లు అరవింద్, దువ్వూరి సుబ్బారావు వంటి వారు వచ్చి వెళ్లారు. కిషన్ రెడ్డి తప్ప కేంద్ర మంత్రులు కూడా రాలేదు. గ్రీన్ ఎనర్జీ, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చాయి. డేటా సెంటర్లకు రూ.85 వేల కోట్లు, ఫార్మాకు రూ.3,500 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.2 వేల కోట్ల ఎంవోయూలు జరిగాయి. వీటిలో చాలా వరకూ కొత్తవి కావు. ఉన్న వాటికి అదనపు పెట్టుబడులే.
పెట్టుబడుల ఒప్పందాలు గ్రౌండ్ చేయించడం కీలకం సమ్మిట్‌లో ప్రధానంగా శక్తి, ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై దృష్టి సారించారు. మొత్తం ఒప్పందాల్లో పవర్ సెక్టార్ మాత్రమే రూ. 3.24 లక్షల కోట్లు (సుమారు 56%) పొందింది. ఇతర సెక్టార్లు కూడా ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయి, కానీ అంతర్జాతీయ దిగ్గజాలు పాల్గొనేకపోవడంతో గ్లోబల్ ఇమేజ్ మెరుగుపడలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ సెక్టార్‌లో గ్రీన్ హైడ్రోజన్, సోలార్, బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్రాజెక్టులు ఆకర్షణీయం, కానీ ఇవి స్థానిక కంపెనీలు మాత్రమే. ఐటీ, ఫార్మాలో అంతర్జాతీయ దిగ్గజాలు లేకపోవడంతో, తెలంగాణ గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు ముందుకు పడలేదని అనుకోవచ్చు.
గ్లోబల్ ఇమేజ్ కోసం మరింతగా కష్టపడాల్సిందే !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించినప్పటికీ, అంతర్జాతీయ ఆకర్షణ లేకపోవడంతో ప్రభుత్వం మీద విమర్శలు పెరిగాయి. రాజకీయంగా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ డ్రైవ్‌గా ఉండాల్సి ఉంది. భవిష్యత్తులో, ఈ ఒప్పందాల అమలు విఫలమైతే, రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP)పై ప్రభావం పడుతుంది. TGS తెలంగాణ గ్లోబల్ ఇమేజ్‌ను మెరుగుపరచలేకపోయినా, ప్రకటించిన పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వం ఇకపై అంతర్జాతీయ రోడ్‌షోలు, MNCలతో డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అధికారులు, పరిశ్రమలు ఈ ఒప్పందాల అమలుపై మానిటరింగ్ చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.