Hyderabad Rains | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. భారీ వర్ష సూచనతో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రివరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచగా.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆగస్టు 13 నాటికి వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ వాసులకు అలర్ట్..హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. కానీ ఆ తరువాత నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆ సమయంలో అత్యవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే కొన్ని ప్రాంతాల ప్రజలు భయపడేలా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం, కామారెడ్డి, సిరిసిల్లలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2 గంటల పాటు తీవ్ర వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నేడు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వంటి దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
ఆగస్టు నెలలో మూడోసారిక్లౌడ్ బరస్ట్ కావడంతో హైదరాబాద్ లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆగస్టు నెలలో ఇది మూడోసారి. శనివారం సాయంత్రం నుంచి రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైంది. బేగంబజార్: 117.5 మి.మీచార్మినార్: 106.3 మి.మీఖైరతాబాద్ CESS: 94.3 మి.మీనాంపల్లి: 92 మి.మీఆసిఫ్ నగర్r: 91.8 మి.మీహయత్ నగర్: 90.5 మి.మీ