Colleges Bandh In Telangana | హైదరాబాద్: తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ ఇతర వృత్తి విద్యా కళాశాలల (Pirivate Colleges) యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. దీపావళి పండుగలోపు రూ.1200 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని కాలేజీ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తోటి మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వృత్తి విద్య కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం మంత్రులు, కాలేజీ యాజమాన్యాలు సంయుక్తంగా మీడియాకు ప్రకటన చేయనున్నారు.
పెండింగ్ బకాయిలు చెల్లించలేదని నిరసినగా బంద్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నాలుగేళ్ల పాటు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వృత్తి విద్యా కళాశాలలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. దాదాపు 8000 కోట్ల వరకు పెండింగ్ ఉందని కాలేజీ యామమాన్యాల సమాచారం. రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బంద్ పాటిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ , ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫెడరేషన్ ఇదివరకే ప్రకటించాయి.
ఆర్థిక సమస్యల్లో తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహణ కోసం, పథకాలకు నిధుల సర్దుబాటు అప్పులు చేస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్ కోర్సులు అందించే బీటెక్, ఎంసీఏ, లా, ఫార్మసీ, ఎంబీఏ లాంటి కాలేజీలు సమ్మెలోకి వెళ్లాయి. సోమవారం నుంచి నిరవధికంగా బంద్ ప్రకటించాయి. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, అసోసియేషన్ తో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ప్రైవేట్ ఆస్పత్రులూ సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తమకు రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధుల బకాయిలు జమ చేయకపోతే సమ్మె తప్పదన్నాయి.
ప్రభుత్వం తరపున ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ పథకాల అమలులో భాగంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఓపిక నశించిన కాలేజీలు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి. మొదట కాలేజీలు నేటి నుంచి నిరవధిక బంద్ కొనసాగిస్తుండగా.. కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి.