Konda Surekha vs Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో ఇరుక్కోవడం, తర్వతా ఆ వివాదం సద్దుమణగడం కొంతకాలం నుంచి రివాజుగా మారింది. అయితే, మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహరం ఆమె పదవీ గండం వరకు దారి తీసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వదవి నుండి సురేఖ ను తప్పించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఇదే పరిస్థితుల్లో కొండా సురేఖ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడడం జరిగింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు వార్తలు వస్తున్నా... పదవీ గండం నుండి కొండా సురేఖ బయటపడటానికి ప్రధానంగా రెండు కారణాలే దోహదం చేశాయి. ఈ రెండు కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Continues below advertisement


జరిగిన వివాదం ఏంటంటే...?


మాజీ ఓఎస్డీ సుమంత్ దక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో సుమంత్ ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ నివాసానికి రావడం, అక్కడ సురేఖ కుమార్తే సుష్మిత వారిని అడ్డగించడం జరిగింది. ఈ సందర్భంలో సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. గతంలోను సినీ ప్రముఖడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రులతోను, వరంగల్ జిల్లా నేతలతోను ఉన్న విబేధాలు కారణంగా ఆమెను పదవి నుండి తొలగిస్తారన్న ప్రచారం బాగా సాగింది. ఏకంగా తనపైన, తన కుటుంబ సభ్యులపైన క్యాబినెట్ మంత్రిగా ఉండి కొండా సురేఖ, ఆమెతో పాటు సుష్మిత ఎలా వాఖ్యలు చేస్తారని సీఎం ఇతర మంత్రుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఏ చర్య తీసుకోకుండా ఉంటే అది తన సమర్థత పైన, తన విశ్వసనీయతపైన అది ప్రభావం చూపిస్తుందని హై కమాండ్ తో కూడా వాదించినట్లు తెలిసింది.




హైకమాండ్ సైతం పలు మార్లు వివాదాల్లో కొండా సురేఖ పేరు వినపడటం తమకు తలనొప్పిగా ఉందన్న అభిప్రాయంలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ ఇంటి వద్ద భద్రత తగ్గించడం, ఆమె శాఖ ఫైళ్లన్నింటిని సీఎం తెప్పించారన్న వార్తలు వచ్చాయి. ఇక వేటు మంత్రి పదవి నుండి కొండా సురేఖ ను తొలగించడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సీన్ మారిపోయింది. కొండా వివాదం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ల వద్దకు చేరింది. క్యాబిటెన్ మీటింగ్ ఉన్నప్పటికీ కొండా సురేఖను పార్టీ అధిష్టానం పిలిచి ఈ వివాదంపై చర్చించింది. ఈ వివాదాన్ని తాను హైకమాండ్ కే వదిలేస్తున్నానని, వారే దీన్ని పరిష్కరిస్తామని హమీ ఇచ్చినట్లు ఆ సమావేశం ముగిసాక మీడియా ముందు తెలిపింది. వేటు తప్పదన్న తరుణంలో కొండా సురేఖను రెండు కారణాలు కాపాడాయని తెలుస్తోంది.


మొదటి కారణం - కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న బీసీ నినాదం


హిందుత్వ ఎజెండాతో బీేజేపీ దేశంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంటే, దానికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుంది. అందుకు తొలి ప్రయోగ శాల తెలంగాణ రాష్ట్రం అయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కోర్టుల్లో ఇది నానుతున్నా ప్రజల్లోకి మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పెద్ద ఎత్తును ఆ పార్టీ తీసుకెళ్తోంది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ బీసీ మంత్రం తమ పార్టీని కేంద్రంలోను, అధికారంలోను తీసుకువస్తుందన్న ఆశతో హస్తం నేతలు ఉన్నారు. ఈ క్రమంలో క్యాబినెట్ లో బీసీ మహిళా మంత్రి అయిన కొండా సురేఖను తొలగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుదంన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి పట్టుబట్టినా అధిష్టానం మాత్రం నో చెప్పినట్లు సమాచారం.


బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ


బీసీ నినాదంతో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా చర్చ లేవనెత్తుతుంటే క్యాబినెట్ లో ఉన్న బీసీ మహిళా మంత్రిని తొలగిస్తే అది మరింత వివాదం అవుతుందన్న ఆలోచనలో హైకమాండ్ పెద్దలు ఉన్నట్లు అర్థం అవుతుంది. కొండా సురేఖను తొలగిస్తే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం బీసీలే. ఈ తొలగింపు వ్యవహరం వారికి పార్టీపై నెగిటెవ్ సంకేతాలు పంపుతుందన్న నిర్ణయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లు సమాచారం. కొండా సురేఖను పదవి నుండి తొలగిస్తే బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అన్న విమర్శను బీసీ సంఘాల నుండి అటు ప్రతిపక్షాల నుండి ఎదుర్కోకక తప్పని పరిస్థితి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్టుబట్టినా వద్దని వారించినట్లు సమాచారం.


మరో వైపుఈ వివాదాన్ని ఇప్పటికే కొండా సురేఖ వర్గీయులు బీసీ వర్సెస్ రెడ్ల మధ్య పోరుగా అభివర్ణించడాన్ని కూడా అధిష్టానం దృష్టికి వచ్చి కొండా సురేఖపై ఎలాంటి చర్యకు పచ్చజెండా ఊపలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పాటు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రతీ చోట మాట్లాడుతోంది. అలాంటిది క్యాబినెట్ నుండి మహిళను తప్పించడం కూడా మహిళలకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న ఆలోచన పార్టీ పెద్దలు చేసినట్లు హస్తం ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉండటంతో ఈ వివాదానికి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ కు, మంత్రి కొండా సురేఖకు సర్దిచెప్పినట్లు చెబుతున్నారు.


రెండో కారణం - వివాదాన్ని తన వ్యాఖ్యలతో మలుపు తిప్పిన కొండా సుష్మిత


బీసీ మంత్రి కావడం వల్ల కొండా సురేఖను పదవి నుండి తప్పించకపోవడానికి ప్రధాన కారణం అయితే, రెండో కారణం కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు కూడా ప్రధాన కారణంగా మారింది. మాజీ ఓఎస్టీ సుమంత్ గన్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలపై ఆమె మీడియా ముందు మాట్లాడుతూ ఈ వివాదంలోకి సీఎం రేవంత్ రెడ్డిని లాగడం ఇక్కడ కీలక మలుపుగా చెప్పవచ్చు. పోలీలుసులు చెబుతున్నట్లు సుమంత్ గన్ తో బెదిరించిన వ్యవహారం అంతా సీఎం సన్నిహితుడైన రోహిన్ రెడ్డి కార్యాలయంలోనే జరిగింది మీడియా ముందు చెప్పడంతో దీంట్లో సీఎం ను భాగస్వామ్యుడ్ని చెసినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డినే గన్ ఇచ్చి పంపారు అన్న వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అంతే కాకుండా సీఎం సోదరులు దందాలు చేస్తున్నారని, వారికి పోలీస్ భద్రత ఎందుకన్న సుష్మిత వ్యాఖ్యలు సీఎంను ఇరకాటంలో పడవేశాయి. అంతే కాకుండా ఢిల్లీలో తన తల్లిని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందే అవమానించారని చెప్పడం కూడా కొన్ని వర్గాల్లో కొండా సురేఖకు సింపతీని అందిచాయి.



రాజకీయంగా సీఎంకు ఇబ్బందికర పరిస్థితి


సుమంత్ వ్యవహారం సాగదీసి విచారణ జరిపితే అక్కడ రోహిన్ రెడ్డి పైన కూడా విచారణ జరపాలన్న డిమాండ్ కొండా వర్గం నుండి రావచ్చు. ఇది రాజకీయంగా సీఎంకు ఇబ్బదికరంగా మారవచ్చు అన్న కారణంతో హై కమాండ్ కూడా దీన్ని ఇంతటితో వదిలేయాలని ఇరు వర్గాలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డే తన తల్లిపై కుట్రకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించడంతో అటు ప్రజల్లోను సీఎం రేవంత్ వ్యవహారంపై ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు మంత్రి పదవి నుండి తప్పించడానికి రెడ్డి మంత్రులు కుట్ర చేస్తున్నారన్న మరో ప్రధాన ఆరోపణ రాష్ట్రంలో కుల పంచాయతీకి తెరలేపినట్లయింది. ఇదే కాకుండా టెండర్ల విషయంలోను తమ వర్గానికి అప్పగించడంలో మంత్రులు జోక్యం చేసుకుంటున్నారన్న అంశాన్ని కూడా సుష్మిత మీడిాయ ముందు చెప్పడం పార్టీకి ఇబ్బంది కలిగించేలా పరిణమించాయి. ఈ క్రమంలోనే కొండా సురేఖ మీడిాయ ముందు మాట్లాడుతుందని సమాచారం బయటకు రాగానే దీన్ని ఇంతటితో ఆపకపోతే పార్టీకి చెడ్డపేరు రావడం ఖాయమన్న ఆలోచనలతో హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఇరు వర్గాలకు సర్దిచెప్పి ప్రస్తుతానికి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.


అయితే ఏది ఏమైనా కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య తగాదా ప్రభుత్వంలోని లుకలుకలను బయటపెట్టింది. మంత్రుల మధ్య విబేధాలు ఈ వ్యవహారంతో రచ్చకెక్కాయి. అవినీతి, బెదిరింపులు జరుగుతున్నాయన్న మచ్చ కాంగ్రెస్ సర్కార్ పై పడింది. అయితే రానున్న కాలంలో ఈ వివాదాలు, సమస్యలకు రేవంత్ సర్కార్ ఎలా ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సిందే.