దేశంలో తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసన్ సరఫరా చేసే కార్యక్రమానికి తెలంగాణ వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు శనివారం వికారాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్​లో డ్రోన్లతో ఔషధాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 






 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం


 డ్రోన్ల ద్వారా మారుమూల అటవీ ప్రాంతాలకు ఔషధాలు రవాణా చేయడం కోసం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేసేందుకు ఈ ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. సుమారు 40 కిలోమీటర్ల వరకు ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. ఒక్క డ్రోన్​లో 15 రకాల ఔషధాలు, టీకాలు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. మెడిసిన్ నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్​లో 4 బాక్సుల్లో మందులు సరఫరా చేస్తారు. 


 



700 మీటర్ల ఎత్తు వరకు


భూమికి 500-700 మీటర్ల ఎత్తులో డ్రోన్ ఎగరగలదు. తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సౌజన్యంతో ఐటీశాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ ఫ్లైట్ల ద్వారా అటవీ ప్రాంతాల్లోని మారుమూల ప్రదేశాలకు ఔషధాలు సరఫరా చేయడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 


ముందుగా ఇక్కడ సరఫరా


వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 5 పీహెచ్‌సీలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవేస్తారు. వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడ, ధారూర్‌ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ఔషదాలు సరఫరా చేస్తారు.


Also Read: Medicine From Sky: తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్