తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది.
Telangana News: స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం.. దేశానికి తెలంగాణ మార్గదర్శకం
Indiramma Housing Scheme | తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో మొదలుపెట్టిన ఇండ్లకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

- తెలంగాణలో 5 లక్షల ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు.
- మొదటి విడతలో 4 లక్షల ఇళ్లకు పైగా మంజూరు, లక్ష ఇళ్లు పూర్తయ్యాయి.
- జూన్ 1న రెండో విడత ప్రారంభం, 2.5 లక్షల ఇళ్లకు పునాది.
- పాత పథకాల లబ్ధిదారులకు కూడా సొంత ఇంటికి ఆర్థిక సహాయం.
హైదరాబాద్: ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉచితంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ఈ పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా, పేద కుటుంబాల జీవితాలను మార్చేసే ఒక సామాజిక ఉద్యమంగా మారిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు, సూచనల మేరకు మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. గతేడాది ఫిబ్రవరి మూడో వారంలో నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయగా, కేవలం 13 నెలల కాలంలోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో రెండు నెలల్లో ఇంకో 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆర్థిక విజయవంతమైన ప్రణాళిక దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు.
జూన్ 1న రెండో విడత ప్రారంభం.. కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత కార్యక్రమానికి జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా పునాది పడనుంది. అలాగే కొత్తగూడలో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో కలుపుకుని, రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5500 నుండి 6500 ఇళ్లను కేటాయించినట్లు అవుతుందని మంత్రి పొంగులేటి వివరించారు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా మరో 500 నుండి 1500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 2.50 లక్షల ఇళ్లకు కలిపి మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు లభించాయి. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, మరింత పటిష్టంగా రెండో విడతను అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలు చేపడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సొంత నిధులతో పేదవాడి ఇళ్లకు పూర్తి భరోసా ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం కేవలం రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి రూ.5 లక్షల భారీ సహాయాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు.
Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
పాత పథకాల లబ్ధిదారులకు కూడా ఆర్థిక సహాయం
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఈ రెండో విడతలో ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాగే 2023 లో గృహలక్ష్మి పథకంలో ఇళ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా ఈ విడతలో నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరమ్మ పథకంలో కేవలం రూ.20 వేల వరకు ఆర్థిక సాయం పొంది ఆగిపోయిన వారికి కూడా ఈ విడతలో ఇళ్ల మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
తెలంగాణలో పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేస్తోంది?
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఎన్ని ఇళ్లు మంజూరు చేయబడ్డాయి మరియు ఎన్ని పూర్తయ్యాయి?
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. కేవలం 13 నెలల కాలంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎన్ని ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
రెండవ విడత కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందించే ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం అందించే సహాయంతో పోలిస్తే ఎలా ఉంది?
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల భారీ సహాయాన్ని సొంత నిధులతో అందిస్తోంది.
గతంలో మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుందా?
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఈ రెండో విడతలో ఆర్థిక సాయం అందిస్తారు.
ట్రెండింగ్ వార్తలు























