Telangana High Court :  భారత రాష్ట్ర సమితికి వరుసగా కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ దండె విఠల్ పై అనర్హతా వేటు పడింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి దండె విఠల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.   దండె విఠల్‌కు రూ.50,000ల జరిమానా విధించింది.                                                                  


2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా కేసీఆర్ దండె విఠల్ ను ఖరారు చేశారు. ఈ పేరుతో విబేధించిన అప్పటి  బీఆర్ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్  దాఖలు చేశారు. అయితే నామనేషన్ల ఉపసంహరణ సమయంలో ఆయన పేరుతో ఉపసంహరణ దరఖాస్తు వచ్చిందని చెప్పి.. ఆయన నామినేషన్ పత్రాలను ఉపసంహరించేశారు రిటర్నింగ్ అధికారి. కానీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రె్డి తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తన సంతకం ఫోర్జరీ చేసి.. ఉపసంహరించినట్లుగా ప్రకటించారని కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం .. నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకం పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చి.. ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.                                          


2021  ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండె విఠల్ ఏకపక్ష విజయం సాధించారు.  ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి 667 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు.  మొత్తం ఓట్లలో దండే విఠ‌ల్ 742 ఓట్ల‌ు తెచ్చుకున్నారు.  ఆదిలాబాద్ లో మొత్తం ఓట్లు 860. అందులో చెల్లిన ఓట్లు 810, చెల్లని ఓట్లు 45 ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పెందూరి పుష్పరాణి 75 ఓట్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణతో అసలు  వివాదం ప్రారంభమయింది.                                   


ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడంతో వారి స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పటికే పూర్తయింది. కోడ్ కారణగా కౌంటింగ్ వాయిదా పడింది. వరంగల్, నల్లగొండష ఖమ్మం  పట్టభద్రుల ఎమ్మెల్ీస నియోజకవర్గానికి నోటిఫికేషన్ వచ్చింది. రెండో తేదీ నుంచి నామినేషన్లు  స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.