జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి అంశంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరైన వారి లిస్టును శనివారం మధ్యాహ్నంలోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ఇక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని తెలిపారు. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Junior Panchayat Secretary: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్! సీఎస్ కీలక ఆదేశాలు
ABP Desam
Updated at:
12 May 2023 10:39 PM (IST)
సమ్మె విరమించని వారితో ఇక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని తెలిపారు. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె