Will KTR arrest in  formula E case:   ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్)పై ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. రూ. 54.88 కోట్ల మోసపూరిత లాభాలతో ముడిపడిన ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసే మార్గం సుగమమైంది. అయితే, కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది రాజకీయ, చట్టపరమైన  అంశాలపై ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.  

Continues below advertisement

ఫార్ములా ఈ రేస్ 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన కేసు. మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో  రూ. 54.88 కోట్లు ను ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (FEO)కు బదిలీ చేశారని ఆరోపణ. ఈ మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి వచ్చింది. ఏసీబీ దర్యాప్తులో, కేటీఆర్ అనుమతి లేకుండా డబ్బులు విడుదల చేశారని, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండా చేసినట్లు తేలింది. మరోవైపు, ఈవెంట్ స్పాన్సర్ Ace Nxt Gen  సంస్థ Grenko సబ్సిడరీ  నుంచి కేటీఆర్‌కు రూ. 45 కోట్ల ఎలక్షన్ బాండ్లు వచ్చాయని క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చాయి.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ లావాదేవీలకు రూ. 8 కోట్ల జరిమానా విధించింది.

ఏసీబీ సెప్టెంబర్ 9, 2025న ప్రాసిక్యూషన్ రిపోర్ట్ సమర్పించింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు అనుమతి అడిగింది. రెండు నెలల తామసం తర్వాత, నవంబర్ 18న   గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తుంది. కేటీఆర్‌తో పాటు మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా  నిందితులు.  అర్వింద్ కుమార్‌పై DoPT అనుమతి అవసరం, కానీ కేటీఆర్‌పై గవర్నర్ అనుమతి సరిపోతుంది.              

Continues below advertisement

 ఏసీబీ ఇంతకుముందు కేటీఆర్‌ను నాలుసార్లు విచారించింది. జనవరీ 7, 2025న తెలంగాణ హైకోర్టు FIRను క్వాష్ చేయకుండా తిరస్కరించింది. డిసెంబర్ 2024లో హైకోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇచ్చింది, కానీ అది డిసెంబర్ 30 వరకు మాత్రమే. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ తిరస్కరించింది. ఇప్పుడు ఛార్జ్‌షీట్ తర్వాత, ఏసీబీ అరెస్టు వారంట్ తీసుకోవచ్చు. వారంట్ తీసుకోకుడా అరెస్టు చేసే అవకాశాల్లేవని అంచనా వేస్తున్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "బలమైన ఆధారాలు ఉన్నాయి, జైలుకు వెళ్తారు" అని రాజకీయ సభల్లో చెప్పారు. బీజేపీ అడ్డుకుంటోందని కూడా ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఎప్పుడో వచ్చింది. అయినా ఏసీబీ అలాంటి ప్రయత్నం చేయలేదు. కోర్టు అనుమతి ఉంటే అప్పుడు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ మాత్రం చాలా సార్లు తాను అరెస్టుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు.