Just In





Telangana Schemes: అభివృద్ధి దిశగా సాగుతోన్న తెలంగాణలో అమలవుతోన్న పథకాలివే
Telangana : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రజల మెప్పు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో కొన్ని పథకాలేంటో ఇప్పుడు చూద్దాం.

Govt Schemes in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సామాజిక సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించింది. ఇప్పటికే నిరుద్యోగులు, బాలికలు, యువత, మహిళా సాధికారత, పెన్షన్ పథకాలు తదితర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. ప్రభుత్వం ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, మరోపక్క అభివృద్ధి వైపు ఫోకస్ చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అవి దేనికోసం రూపొందించారన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ ప్రజాపాలన పథకం 2024
తెలంగాణలో ప్రజాపాలన పథకం.. అంటే అభయహస్తం పథకం లేదా 6 గ్యారంటీలు అనే ప్రత్యేక కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుటింది. ఇది రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ సేవలను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రజాపాలన కార్యక్రమం కిందకు వచ్చే 6 నిర్ధిష్ట పథకాలు ఎంతో కీలకమైనవి. అవి
మహాలక్ష్మి పథకం
ఈ పథకం ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, తెలంగాణ అంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉన్నాయి.
చేయూత పథకం
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ. 10 లక్షల ఆర్థిక కవరేజీని ప్రభుత్వం అందిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని అంచనా. శారీరక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు 21 ప్రత్యేక సేవలతో పాటు 1,672 విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి.
గృహ జ్యోతి పథకం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నివాసితుల కోసం గృహ జ్యోతి అనే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకుఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ పరిమితిని మించిన ఏ యూనిట్‌కైనా ఛార్జ్ విధిస్తారు. కుటుంబాలు తమ నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువగా ఉంటే, వారు ఈ పథకం కింద ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం
ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, అది కూడా భూమి లేనివారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందించనున్నారు. దీనికోసం 4. లక్షల ఇళ్లు సిద్ధం చేయనున్నారు. ఇది జనవరి 26, 2025 నుంచి ప్రారంభమైంది.
యువ వికాసం
తెలంగాణ యువ వికాసం పథకం విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థులను పై చదువులు చదవడానికి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో ఒకటి.
వీటితో పాటు తెలంగాణలో మరికొన్ని పథకాలు అమలవుతున్నాయి.
రైతు బీమా
రైతు బీమా పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పంటల బీమా పథకం. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడులు, ఇతర అనుకోని పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
ఆరోగ్య లక్ష్మి
గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, ఆరేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రతి రోజూ పోషకాహార భోజనాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్య లక్ష్మి. ఈ స్కీమ్‌ను జనవరి 1, 2015న తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. అంగన్‌వాడీల ద్వారా ఈ పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
రైతు బంధు
దీనిని రైతు పెట్టుబడి మద్దతు పథకం (FISS) అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రెండు పంటలకు రైతుల పెట్టుబడికి మద్దతు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఆసరా ఫించన్లు
ఇది వృద్ధులు, వితంతువులు, గౌడ్‌లు, ఏనుగు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ బాధితులు, శారీరక వికలాంగులు, బీడీ, గీత కార్మికుల కోసం నిర్దేశించిన పథకం. బీడీ కార్మికులకు ఆసరా పింఛను అందిస్తోన్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
నేతన్న బీమా
నేతన్నకు చేయూత పథకం (తెలంగాణ హ్యాండ్‌లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీం) అనేది తెలంగాణ రాష్ట్ర నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.
అన్నపూర్ణ పథకం
అన్నపూర్ణ భోజన పథకం, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలో కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం.
కుట్టు యంత్రాల పథకం
ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆర్థిక పునరావాస పథకం
తెలంగాణలో వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల కోసం ఆర్థిక పునరావాస పథకం ఉంది. ఈ పథకం ద్వారా వారికి రుణాలు అందజేస్తారు.