హైదరాబాద్: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. రాష్ట్రంలో జనగణనపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓ నంబర్ 155 విడుదల చేసింది.
వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రెండవ విడత జనాభా లెక్కల సేకరణను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా వివరాల నమోదును మరింత సులభతరం చేస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానానికి అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు ప్రత్యేక యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోద చేసుకునే అవకాశం అందుబాటులో ఉండనుంది.
తెలంగాణలో రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత ఇళ్ల గణన (హౌస్‌లిస్టింగ్) ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో విడత జనాభా గణన కోసం అధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
