Telangana Corporations Chairmans: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను (Telangana Corporation Chairmans) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన జీవోను మార్చి 15నే సర్కారు విడుదల చేయగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా పదవుల భర్తీలో జాప్యం జరిగింది. ఎన్నికల ముగియడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తాజాగా, ఛైర్మన్ల నియామకపు ఉత్తర్వులు మళ్లీ విడుదల చేశారు. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.






కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే..



  • టీఎస్ఐఐసీ (TSIIC) ఛైర్ పర్సన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి నియమితులయ్యారు.

  • విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అన్వేష్ రెడ్డి

  • ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి

  • ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కాసుల బాలరాజు

  • రాష్ట్ర సహకారం సంఘం ఛైర్మన్‌గా మోహన్ రెడ్డి

  • గోదాంల సంస్థ ఛైర్మన్‌గా నాగేశ్వరరావు

  • ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

  • మత్స్య సహకార సమాఖ్య ఛైర్మన్‌గా మెట్టు సాయికుమార్

  • గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా రియాజ్

  • అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పొదెం వీరయ్య

  • ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్‌గా కాల్వ సుజాత

  • పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గురునాథ్ రెడ్డి

  • సెట్ విన్ ఛైర్మన్‌గా గిరిధర్ రెడ్డి

  • కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా జనక్ ప్రసాద్

  • హస్త కళల అభివృద్ధి ఛైర్మన్‌గా నాయుడు సత్యనారాయణ

  • నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా విజయ్ బాబు

  • ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ ఎర్రవాత్

  • వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా ప్రకాశ్ రెడ్డి

  • సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె సతీష్ కుమార్

  • పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి

  • శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కె.నరేందర్ రెడ్డి

  • కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి

  • రహదారి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మల్ రెడ్డి రామిరెడ్డి

  • తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్‌గా ఎం.ఎ.ఫహిమ్

  • మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్‌గా శోభారాణి

  • స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్‌గా శివసేనారెడ్డి

  • వికలాంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా ఎం.వీరయ్య

  • సంగీత నాట్య అకాడమీ ఛైర్ పర్సన్‌గా అలేఖ్య పుంజాల

  • ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్.ప్రీతం

  • ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బెల్లయ్య నాయక్

  • బీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నూతి శ్రీకాంత్

  • గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్‌గా కె.తిరుపతి

  • మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం.ఎ.జబ్బార్

  • వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జైపాల్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ఒకటి, రెండు రోజుల్లో వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు నియామక తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.


Also Read: Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్