ADE Ambedkar found to have illegal assets worth Rs 200 crore: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ .. విద్యుత్ విభాగంలో అతి పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టుకుంది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అంబేద్కర్ నివాసం, బంధువుల ఇళ్లపై భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఈ రైడ్స్‌లో రూ.2 కోట్లకుపైగా నగదు, బంగార ఆభరణాలు, మూడు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఒక భవనం, 10 ఎకరాల వ్యవసాయ భూమి, 1,000 చదరపు గజాల ఫామ్‌హౌస్ వంటి ఆస్తులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అంబేద్కర్ బెనామీల పేర్లపై ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.
మొత్తం ఏసీబీ 18 బృందాలుగా విడిపోయి మణికొండలోని అంబేద్కర్ నివాసం, గచ్చిబౌలి, మధాపూర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బినామీ సతీష్ ఇంట్లోనే రూ.2 కోట్ల నగదు నోట్ల కట్టల రూపంలో పట్టుబడింది. ఈ నగదు అంబేద్కర్ అక్రమ సంపాదనలో భాగమని అధికారులు గుర్తిచారు. సోదాల సమయంలో డాక్యుమెంట్లు, పత్రాలు పెద్ద ఎత్తున దొరికాయి.
దొరికిన ఆస్తులు
- హైదరాబాద్ మూడు ఖరీదైన ప్లాట్ - గచ్చిబౌలి ప్రాంతంలో ఒక ఖరీదైన భవనం (బంధువు పేరుపై ఉంది).- వ్యవసాయ భూములు , ఫామ్‌హౌస్**: - సూర్యాపేట్ జిల్లా పెంపహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి. - అదే ప్రదేశంలో 1,000 చదరపు గజాల్లో ఒక ఫామ్‌హౌస్.- రెండు కార్లు
బ్యాంక్ డిపాజిట్లు, ఇతర విలువైన వస్తువులు. మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రాథమిక అంచనా. బినామీల పేర్లపై ఉన్న గృహాలు, స్థలాలు, ఫామ్‌ల్యాండ్‌లు జాబితాను ఏసీబీ రెడీ చేస్తోంది.
అంబేద్కర్ మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీఈగా పనిచేస్తూ, విద్యుత్ కనెక్షన్లు, చిన్న పనులకు కూడా భారీ లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాల్స్, థియేటర్లు, వాణిజ్య సంస్థలకు కనెక్షన్లు ఇవ్వడానికి లంచాలు తప్పనిసరిగా డిమాండ్ చేసేవారని, కస్టమర్లను హింసించేవారని ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. గతేడాది అవినీతి, డ్యూటీలో లేకపోవడం వంటి కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు, కానీ కొన్ని వారాల్లో తిరిగి డ్యూటీకి వచ్చారు. ఈ ఆస్తులు అక్రమ లంచాలతోనే కూడబెట్టబడ్డాయని ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేశారు.