Telangana Elections 2023 : ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ( MLA Rekha Naik ) సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన రేఖా నాయక్ ‘ఏం రా కేసీఆర్.. ఏం మొఖం పెట్టుకుని ఖానాపూర్‌లో ఓట్లు అడుగుతావ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్.. నీ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ గెలుస్తాడని ఎలా చెబుతావ్..? నీ చెంచాలు, గ్లాసులు ఎత్తేవాళ్లకు ఖానాపూర్‌లో ఓట్లు ఎలా వేస్తాం’’ అని మండిపడ్డారు. అసలు కేసీఆర్‌కు ( CM Kcr ) బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. కాగా, ఖానాపూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు బీఆర్ఎస్ నిరాకరించిన విషయం తెలిసిందే.
ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను పక్కన పెట్టిన బీఆర్ఎస్.. మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికీ చేరారు. అయినా కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కలేదు. అయినా ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ వెడ్మ బొజ్జుకు అవకాశం ఇచ్చింది. రేఖానాయక్ సీఎం కేసీఆర్‌ను ‘ఏం రా’ అని విమర్శించడంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ( BRS ) సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తన్నారు.
ఖానాపూర్‌లో ఆమెకు టిక్కెట్ ఇవ్వకపోయినా అసిఫాబాద్‌లో రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కె్ట ఇచ్చింది. ఈ కారణంగా ఆమె కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిస్తుతన్నారు. కేసీఆర్ మిత్రుు అయిన జాన్సన్ నాయక్ కు రేఖా నాయక్ స్థానంలో టిక్కెట్ కేటాయించడంతోనే రేఖా నాయక్ కుటుంబం తీవ్ర అసంతృప్తికి గురయింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్యా శామ్యూల్ నాయక్, కేస్లీబాయి దంపతుల కుమారుడు భూక్యా జాన్సన్ నాయక్. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. నిజాం కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చదివి, ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లమా చేశారు. ఆ సమయంలో కేటీఆర్ తో స్నేహం ఏర్పడింది.
మొదట్లో ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీలోఉద్యోగం చేసి.. తరువాత అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నెలకొల్పారు. కొంత కాలం అక్కడే స్థిరపడ్డారు. అయితే నిజాం కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్, జాన్సన్ నాయక్ ఇద్దరూ క్లాస్‌మెట్స్ కావడంతో వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. కేటీఆర్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో ప్రజాసేవ చేయడానికి ఆసక్తి పెంచుకున్నారు జాన్సన్ నాయక్. పార్టీ అధిష్టానం ఖానాపూర్ టికెట్ కన్ఫామ్ చేయడంతో ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాలలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు జాన్సన్ నాయక్. ఆయన క్రిస్టియన్ అని.. గిరిజనుడు కాదని.. రేఖానాయక్ ఆరోపిస్తున్నారు. పైగా స్థానికుడు కాదంటున్నారు. అయితే ముందుగానే కొంత కాలం నుంచి ఖానాపూర్ లో పనిచేసుకుంటున్న జాన్సన్ నాయక్ కే టిక్కెట్ ఖరారు చేశారు.