తెలంగాణలో కరోనా కేసులు నేడు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 592 మందికి కోవిడ్‌ 19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 27,488 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజా లెక్కలతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,04,529 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డట్లు అయింది. వీరిలో 7,95,421 మంది వైరస్ నుంచి కోలుకోగా మరో 4,997 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.


కొత్తగా నమోదైన కేసులతో తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,997కు చేరింది. రికవరీ రేటు 98.87శాతంగా ఉందని వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. తాజాగా వచ్చిన కరోనా వైరస్‌ కేసులలో హైదరాబాద్‌లో 331, రంగారెడ్డి 60 జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం 17, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 45, హన్మకొండ 10, భువనగిరి 9, కరీంనగర్‌ 9, నల్గొండ జిల్లాలో 11 చొప్పున కరోనా కేసులు ఉన్నట్లు గుర్తించారు.


దేశంలో ఇలా..
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. తాజాగా 14,650 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.26 శాతం ఉన్నాయి.






కొత్త వేరియంట్ రాక
మరోవైపు కరోనా ఒమిక్రాన్​ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75 భారత్​లో వెలుగుచూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తొలుత భారత్​లో కనిపించిన ఈ వేరియంట్.. ఇప్పటివరకు 10 దేశాల్లో బయటపడ్డట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 


డైలీ పాజిటివిటీ రేటు: 4.32 శాతం
మొత్తం మరణాలు: 5,25,305
యాక్టివ్​ కేసులు: 1,19,457
మొత్తం రికవరీలు: 4,29,21,977
వ్యాక్సినేషన్


దేశంలో కొత్తగా 11,44,489 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,33,18,772కు చేరింది. మరో 4,38,005 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది. మాస్కులు ధరించాలని సూచించింది.