Congress First List: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్  రేపోమాపో వచ్చే అవకాశం ఉండటంతో  ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి  ఢిల్లీ  వెళ్లారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.   జరిగే ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్  చర్చలు జరపనుంది. ఇప్పటికే అభ్యర్థుల  పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్ కు  పంపారు.  ముందుగా పోటీ లేని  చోట్ల   అభ్యర్థులను మొదటగా ప్రకటించే అవకాశం ఉంది. 


తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జోష్ ను లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.  మొత్తం 10 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటిక రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సీటును వంశీచంద్ రెడ్డికి ప్రకటించారు. ఆ సీటు విషయంలో పోటీ లేదు. చేవెళ్ల నుంచి  సునీతా మహేందర్‌ రెడ్డి పేరు కూడా అనధికారికంగా ఖరారు చేశారు. మిగిలిన చోట్ల మాత్రం పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసినందుకు జహీరరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌కు.. నల్లగొండ నుంచి  పటేల్ రమేష్ రెడ్డికి టిక్కెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు హామీని నెరవేర్చాల్సి ఉంది. అయితే  నల్లగొండలో సీనియర్ నేతలు పోటీ పుతున్నారు. 


కరీంనగర్ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి,  నిజామాబాద్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి  గడ్డంవివేక్ కుమారుడు  వంశీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన బొంతు  రామ్మోహన్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.   నాగర్ కర్నూల్ సీటుకు గట్టి పోటీ ఉంది. రేవంత్  సన్నిహితుడు అయిన  మల్లు రవితో పాటు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన సంపత్ కుమార్ కూడా అవకాశం కోసం పోటీ పడుతున్నారు. ఇక ఖమ్మం సీటు కోసం ఉన్న పోటీ గురించి చెప్పాల్సిన పని లేదు. మల్ల  భట్టి విక్రమార్క భార్యతో పాటు పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి పోటీ పడుతున్నారు. 


మరికొన్ని నియోజవకర్గాల్లోనూ గట్టి పోటీ ఉంది. కొన్ని చోట్ల పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నారు. ముందుగా పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. టిక్కెట్ల ఖరారుపై పూర్తి స్వేచ్చను హైకమాండ్ రేవంత్ రెడ్డికే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కనీసం పధ్నాలుగు సీట్లు గెలిపించే టాస్క్ ను హైకమాండ్ ఆయనకే అప్పగించింది. దీంతో ఆయనే కసరత్తు చేసి ఎవరైనా బలమైన నేతలు పార్టీలో చేరే వారంటే.. వారిని చేర్చుకుని ముందుకు వెళ్తున్నారు.