CM Revanth Reddy: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి వెళ్లారు. కుటుంబ సమేతంగా సొంతవూరుకు చేరుకున్న సీఎంకి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

Continues below advertisement

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

కొండారెడ్డిపల్లికి చేరుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి ర్యాలీగా స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు.

గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో భేటీ 

అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తమ గ్రామానికి చెందిన ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Also Read: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన

Continues below advertisement

సాయంత్రం పూజా కార్యక్రమాలు 

దసరా పండుగ సంప్రదాయంలో భాగంగా సాయంత్రం వేళ స్థానిక మైసమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.  అనంతరం విజయదశమికి అత్యంత ప్రాధాన్యత ఉన్న జమ్మిచెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొని, పండుగ వేడుకలను ముగించనున్నారు.  తెలంగాణ సంస్కృతిలో విజయదశమి రోజు జమ్మిచెట్టుకు (శమీ పూజ) పూజలు చేసి, జమ్మి ఆకులను 'బంగారం'గా భావించి ఇంటికి తీసుకెళ్లడం ఆచారం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఏటా తన గ్రామంలోని పెద్దలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పండుగల సమయాల్లో సొంతూరు రావడం రేవంత్‌రెడ్డి ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన బాల్యం, రాజకీయ జీవితం ఈ ప్రాంతంతో ముడిపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటారు. 

Also Read: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్