Phone tapping case Surpreme Court:  తెలంగాణలో  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ టి. ప్రభాకర్ రావుపై కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు తన iCloud అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసి, రాష్ట్ర పోలీస్ ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అందించాలని బెంచ్ ఆదేశించింది.  జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన బెంచ్, ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఈ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అరెస్టు నుంచి ఇచ్చిన తాత్కాలిక రక్షణను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన  అప్లికేషన్‌పై వాదనలు విన్న తర్వాత, బెంచ్ రక్షణను మళ్లీ పొడిగించింది. తదుపరి విచారణ నవంబర్ 18న జరగనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలిత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ట్యాప్ చేసిన కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు (A1). ఈ కేసు 2024 మార్చిలో హైదరాబాద్ పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించాయి. మొత్తం నలుగురు  పోలీస్ అధికారులు  అరెస్ట్ అయ్యారు. వీరు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుంచి డిలీట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ప్రభాకర్ రావు అమెరికాలో ఉండటంతో, తెలంగాణ హైకోర్టు అతని అంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను మే 3, 2025న తిరస్కరించింది.   'ప్రోక్లెయిమ్డ్ ఆఫెండర్'గా ప్రకటించి, ఆస్తులపై ఆర్డర్ చేస్తామని హెచ్చరించింది. పాస్‌పోర్ట్ క్యాన్సిల్ చేసి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. మే 29న సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చి, పాస్‌పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని ఆదేశించింది. సోమవారం విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదు. విచారణ ముందుకు సాగడం లేదని ప్రభుత్వం  తరపు లాయర్ వాదించారు.  కోర్టు రక్షణలో ఉండగానే ఆయన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు iPhones, అధికారిక ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేసి, కీలక సాక్ష్యాలను నాశనం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.   ప్రైవేట్ iCloud, ఇతర క్లౌడ్ బ్యాకప్‌ల ID, పాస్‌వర్డ్‌లు, ఫార్మాటింగ్‌కు ముందు ఉపయోగించిన డివైసెస్ వివరాలు అందించాల్సి ఉందన్నారు. అయితే ప్రభాకర్ తరపు లాయర్ మాత్రం  పాత iCloud పాస్‌వర్డ్ మర్చిపోయారు. దానిని పోలీస్ ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  అది సెన్సిటివ్ డేటా ప్రోటోకాల్ ప్రకారం ఫార్మాటింగ్ చేశారని  డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులే చేశారని ప్రభాకర్ రావు   తెలిపారు.  వాదనలు విన్న బెంచ్, జస్టిస్ నాగరత్న "మీరు డివైస్‌లు డిలీట్ చేశారుగా?" అని ప్రభాకర్ రావు తరఫు లాయర్‌ ప్రశ్నించారు.  తాత్కాలిక రక్షణను నవంబర్ 18 వరకు పొడిగించి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని, సహకరించాలని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోరిన iCloud, క్లౌడ్ బ్యాకప్‌ల వివరాలు, ఫార్మాటింగ్ ముందు డ్రైవ్‌లు అందించాలని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ మరింత ముందుకు సాగనుంది. ప్రభాకర్ రావు ఫోరెన్సిక్ సమక్షంలో పాస్‌వర్డ్ రీసెట్ చేస్తే, కీలక సాక్ష్యాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Continues below advertisement

Continues below advertisement