Viral News: సిలికాన్ సిటీ బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ పరిశ్రమకు దేశ రాజధానిగా వెలుగొందుతోంది. అక్కడ వాతావరణం, కల్చర్ అందరిని సులువుగా ఆకర్షిస్తాయి. అయితే అక్కడ జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంటి అద్దెల విషయానికి వస్తే చుక్కలు కనిపిస్తాయని తెలుస్తుంది. చిన్న సూది నుంచి ఇంట్లో కూరగాయల వరకు ప్రతీది అధిక ధరలు పలుకుతాయి. అరకొర ఆదాయంతో సామాన్య, సన్న, చిన్న ఉద్యోగాలు చేసేవారు బెంగళూరులో బ్రతకడం అంటే కష్టమనే చాలా మంద అంటారు.


బెంగుళూరులో ఐటీ పరిశ్రమ పుణ్యమా అంటూ ఇంటి అద్దె నుంచి మొదలు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే భాగ్యనగరంలో అన్నీ అందుబాటులో ఉంటాయనే ప్రచారం సైతం బాగా జరుగుతోంది. తక్కువ ధరకే ఇళ్లు అద్దెకు దొరుకుతాయని, నిత్యాసరాలు తక్కువ ధరకు లభిస్తాయి. పైగా బెంగళూరు ఏమాత్రం తీసినపోని వసతులు ఉన్నాయి. ఐటీ పరిశ్రమతో పాటు, మెట్రో, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం తగ్గడం, ఎక్కువగా ఆదా చేసుకునే అవకాశం ఉందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.






ఇటీవల పృధ్వీ రెడ్డి అనే వ్యక్తి ఓ ఐటీ ఉద్యోగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఉద్యోగం మారాడు. ఫలితంగా రూ.40,000 ఆదా చేయగలుగుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు బెంగళూరు, హైదరాబాద్ లను పోల్చుతూ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. పృధ్వీ రెడ్డి (@prudhvir3ddy) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. ఉద్యోగ రీత్యా కుటుంబాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు చెప్పారు. ఫలితంగా నెలకు రూ.40,000 ఆదా చేస్తున్నట్లు పేర్కొనడం వైరల్ అవుతోంది. ఆ డబ్బుతో ఓ ఫ్యామిలీ ప్రశాంతంగా జీవించవచ్చునని అతను చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది. తాజాగా పృధ్వీ రెడ్డి తన పోస్టులో ‘బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారాం. నెలకు రూ.40 వేలు ఆదా అయ్యాయి. ఆ డబ్బుతో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చు.’ అంటూ హైదరాబాద్ గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. కొందరు అతను చెప్పినది నిజమేనని అంగీకరిస్తే మరికొందరు వ్యతిరేకించారు.


బెంగళూరులో జీవన వ్యయం చాలా ఎక్కువ అని ఇటీవల చాలా నివేదికలు తెలిపాయి. ఓ మధ్యతరగతి వ్యక్తి, బ్యాచిలర్‌ జీవించడానికి నెలకు రూ.25,000 కావాలని అంచాన వేసింది. జంటలకు అయితే రూ.50,000 ఉండాలని, నలుగురు అంతకంటే ఎక్కువమంది ఉంటే రూ.70,000 ఆదాయం కావాల్సిందేనట. ఇతర నగరాలతో పోలిస్తే ఈ ఖర్చు చాల ఎక్కువే. మధ్య తరగతి వారు ఉద్యోగ రీత్యా తామొక చోట.. తమ ఫ్యామిలీ ఒక చోట ఉంచే పరిస్థితి ఉండదు. కాబట్టి తమకు అనువుగా ఉన్న చోటకు షిఫ్ట్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.