మాంసం ధరలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చికెన్ ధర కిలో రూ.200 అటు ఇటుగా హెచ్చుతగ్గులు ఉండగా మటన్ రేటు మాత్రం రూ.800 పలుకుతోంది. డిమాండ్ ఉన్న సమయాల్లో అయితే కిలో రూ.వెయ్యి కూడా దాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మాంసం వ్యాపారి మటన్ ధరలను బాగా తగ్గించి అమ్మడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. దాదాపు రూ.800 వరకూ పలుకుతున్న కిలో మటన్ ను ఈ వ్యాపారి ఏకంగా రూ.400 కే విక్రయిస్తు్న్నాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలవారు, ఆ మటన్ షాపుకు పోటెత్తుతున్నారు.
మటన్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత లేదన్నా ప్రస్తుతం కిలో రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లా అయితే మిరుదొడ్డి మండలం అక్బర్‌పేట గ్రామంలో మాత్రం కిలో మటన్ రూ.400 కే అమ్ముతున్నారు. దాదాపు నెలరోజుల నుంచి ఆ గ్రామంలో ఇదే రేటుకు ఆ మాంసం వ్యాపారి అమ్ముతున్నారు. విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో మాంసం ప్రియులు పోటెత్తుతున్నారు.
నిన్న (సెప్టెంబరు 26) ఆదివారం అందులోనూ మహాలయ అమావాస్య కావడంతో ఆ మాంసం వ్యాపారి దుకాణానికి జనం పోటెత్తారు. దీంతో ఆ గ్రామం రద్దీగా మారింది. దుబ్బాక, మిరుదొడ్డి, గజ్వేల్, బీబీపేట, దోమకొండ, రామాయంపేట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎవరికి వారు సొంత వాహనాల్లో మటన్ కొనుక్కొనేందుకు రావడంతో సిద్దిపేట మెదక్ మెయిన్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది.
దీంతో స్థానిక భూంపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మాంసం ప్రియులను అదుపుచేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే ఇంత తక్కువ ధరకు మటన్ విక్రయిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు మాంసం వ్యాపారులు అడ్డుకున్నారు. ఎవరి ఇష్టం మేరకు వారు వ్యాపారం చేసుకుంటున్నారని, అడ్డుకోవడం తగదని అక్బర్‌పేట గ్రామస్థులు వారిని వారించారు.
అక్బర్ పేట గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా మటన్ కిలో రూ.650 వరకు అమ్ముతుంటే రాజేష్ మాత్రం తన దుకాణంలో కిలో మటన్ రూ.400లకు అమ్ముతున్నారు. ఇలా తక్కువ ధరకి మటన్ విక్రయిస్తున్నాం కదా అని నాణ్యతలో ఎక్కడా రాజీపడటం లేదని మాంసం దుకాణ నిర్వహకుడు రాజేష్ తెలిపాడు. రూ.400లకే నాణ్యమైన మటన్‌ని వినియోగదారులకు అందిస్తున్నానని చెప్పాడు. వినియోగదారులు కూడా మాంసం బాగానే ఉందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత చికెన్ ధరలు
Chicken (చికెన్) 1 Kg - 180.00Boneless Chicken (ఎముకలు లేని చికెన్) 1 Kg - 210.00Country Chicken (దేశం చికెన్) 1 Kg - 380.00Live Chicken (లైవ్ చికెన్) 1 Kg - 120.00Chicken Liver (చికెన్ కాలేయం) 1 Kg - 170.00Skinless Chicken (చర్మం లేని చికెన్) 1 Kg - 190.00
మటన్ ధరలు
Mutton 1 Kg - 650.00Boneless Mutton 1 Kg - 750.00Brain 1 Kg - 480.00Head 1 Piece - 240.00Heart 1 Kg - 470.00Intestine 1 Kg - 420.00Kidney 1 Kg - 450.00Legs 1 Piece - 40.00Liver 1 Kg - 450.00