Secunderabad Fire Accident : సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్థులో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నట్లు సమాచారం. మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ టార్చ్ చూపిస్తూ రక్షించాలని పలువురు వేడుకుంటున్నారు. 


ఎగిసిపడుతున్న మంటలు


సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.  ఈ కాంప్లెక్స్ లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయం కోసం ఫోన్ టార్చ్ చూపిస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారు పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయచర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. 


ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు 


విద్యుత్ సరఫరా లేకపోవడంతో భవనంలో లిఫ్టులు పని చేయడం లేదని ఫైర్ సిబ్బంది తెలిపారరు. అదే సమయంలో చీకట్లో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో పలువుు మహిళలు చిక్కుకున్నట్లు తెలుస్తోందన్నారు. తమను కాపాడాలంటూ లోపలి నుంచి కొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడగా, మరో తొమ్మిది మంది లోపలే ఉండిపోయినట్లు సమాచారం. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్‌గా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. 


 ఏడుగురిని రక్షించాం - మంత్రి తలసాని 


స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చిక్కుకున్న ఏడుగురిని ఫైర్ ఫైటర్స్ రక్షించారు. మరో 7 గురు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.  ఐదో ఫ్లోర్ లోని ఈ-కామర్స్ షాపులో మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు. భవనంలో ఇంకొంత మంది చిక్కుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఘటనాస్థలికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఆయన సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. అరగంటలో రెస్క్యూఆపరేషన్ పూర్తి అవుతుందని మంత్రి అన్నారు. ముగ్గురిని రక్షించినట్లు తెలిపారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని మంత్రి చెప్పారు.  ఐరన్ రాడ్స్ బ్రేక్ చేసి బాధితులను రక్షించాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఫైర్ సిబ్బంది తగిన పరికరాలు తీసుకెళ్లి బాధితులను రక్షించాలని సూచించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్క భవనాన్ని పోలీసులు ఖాళీ చేయిస్తు్న్నారు. పైనున్న వారికి ఆక్సిజన్ పంపాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలుస్తోంది.  భవనంలో చిక్కకున్న వారితో ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంటలు అదుపులోకి వస్తున్నాయని, చివరి భాగంలో మాత్రమే మంటలు ఎగిసిపడుతున్నాయ్నారు. ఏడు మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారన్నారు.