Revanth Muchharla Health Hub :  తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ సమీపంలోని ముచ్చర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ హబ్ నిర్మించాలని నిర్ణయించిది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ముచ్చర్ల వల్ల ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం భూములను సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేసిందని ఇప్పుడు తాము ఏదో భూములు లాక్కోబోతున్నట్లుగా వారే ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యకం చేశారు. హైదరాబాద్ లో హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతోందని.. మరిన్ని మెరగైన సేలు అందించేందుకు హెల్త్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.                                       

  


మచ్చర్ల వద్ద గత ప్రభుత్వం ఫార్మాసిటీకి ప్రతిపాదన                        


శంషాబాద్‌లోని ముచ్చర్ల సమీపంలో  వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నామని... శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ హెల్త్ హబ్‌లోకి గ్రీన్ చానల్ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.  ఇతర దేశాల నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో వచ్చే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. హైదరబాద్‌కు  గత పదేళ్లుగా  హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు విదేశీ  పేషెంట్ల రాక ఎక్కువగా ఉంది.  ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్, మిడిలీస్ట్ దేశాలు ఒమన్, ఇరాక్, యెమన్ అలాగే బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘన్ నుంచి కూడా రోగులు హైదరాబాద్ ఆస్పత్రులకు వస్తున్నారు.  సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నుంచి కూడా మన భాగ్యనగరానికి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం లభిస్తూండటమే కారణం.  


హెల్త్ హబ్‌గా ముచ్చర్ల ప్రాంతం                  


మెడికల్ వ్యవస్థలో ఆసుపత్రులు, క్లినిక్‌లు, సర్జన్లతో పాటు మెరుగైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం కీలక అంశాలు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాధాన్యతలను గుర్తించిందని సీఎం రేవంత్ చెబుతున్నారు.  కొన్నాళ్ల కిందటి ఇక్కడ నుంచి వైద్య సేవల కోసం కొంత మంది  అమెరికాకు వెళ్లేవాళ్లు కానీ ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి ట్రీట్‌మెంట్ కోసం వస్తున్నారు. ఇక పొరుగు దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. తక్కువ ఖర్చులో వీలైనంత మెరుగైన వైద్య సేవలు అందించడంలో హైదరాబాద్ ప్రపంచ గుర్తింపును పొందుతోందని  ప్రభుత్వం చెబుతోంది. 


భూసేకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రజల్ని రెచ్చగొడుతోందన్న రేవంత్ 


శంషాబాద్‌లోని ముచ్చర్ల వద్ద ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అయితే గతంలో ఫార్మా సిటీకి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో రైతులు ముందుకు రాలేదు. ఈ కారణంగా వివాదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు..  రైతుల భూమిని లాక్కుంటున్నారని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.