Revant Reddy :  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  హాత్ సే హాత్ జోడు టిపిసిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం నుండి పాదయాత్రకు జన నీరాజనం పడుతూ రేవంత్ రెడ్డిని మంగళహారతులు ఇచ్చి, వీర తిలకంతో ఆహ్వానం పలికారు. ఈ పాదయాత్ర దేవరుప్పుల ధర్మపురం విసునూరు గ్రామాలలో కల్లుగీత కార్మికులను, గొల్ల కురుమలను కలిశారు. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ గురు సేవాలాల్ మహారాజ్ సీతల్ వేడుకల్లో పాల్గొన్నారు.


ఒకనాడు గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్న ఇప్పుడు రూ.1130 పెంచిందని రోజువారి కూలీ సైతం నిత్యావసర వస్తువులకే ధరల కొనుగోలుకి కూలి సరిపోతుందని పలువురు ప్రజలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు.  కాంగ్రెస్ ఉన్నప్పుడే ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సామాన్య ప్రజలను మోసం చేస్తూ.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపంచారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పేదలకు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపు, వంటగ్యాస్ ధర 500 కి ఇవ్వడం, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల అందించి ఇండ్ల నిర్మాణాలకు తోడ్పాటు అందించడం, కులవృత్తుల వారికి తోడ్పాటు అందించడం, గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ జయంతి వేడుకలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని హామీ ఇచ్చారు. 


  ‘‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’’పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 


ఫిబ్రవరి 16వ తేదిన వర్ధన్నపేట నియోజకవర్గం.
ఫిబ్రవరి 17వ తేదిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం.
ఫిబ్రవరి 18 & 19వ తేదిన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విరామం.
ఫిబ్రవరి 20వ తేదిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం & వరంగల్ తూర్పు నియోజకవర్గం.
ఫిబ్రవరి 21 & 22 వ తేదిన భూపాలపల్లి నియోజకవర్గం.
ఫిబ్రవరి 23, 24, 25 & 26వ తేదిన రాయ్ పూర్ ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొంటారు.
ఫిబ్రవరి 27 వ తేదీన పరకాల నియోజకవర్గం.


జలతో మమేకం అవుతూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా ప్రాంతాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను టీపీసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు. సీనియ్ర నేతలు పెద్దగా సహకరించకపోయినా... ఎక్కడికక్కడ పాదయాత్రలు చేపట్టాలని ఆదేశించినా చాలా మంది సీనియర్లు రంగంలోకి దిగలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం...  ఎక్కడా ఆపకుండా పాదయాత్ర చేస్తున్నారు.