Revanth Reddy comments on Hindu gods are causing a stir:  హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుందన చెప్పే క్రమంలో హిందువులకు ఎన్ని దేవతలు ఉన్నారు..? పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నడు.. మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు" అని  వ్యాఖ్యానించారు. గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  

Continues below advertisement

హిందువులు 3 కోట్ల దేవతలను నమ్ముతారని, అంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారని ..వివిధ రకాల వ్యక్తులు, సమూహాలకు ప్రత్యేక దేవుళ్లు ఉన్నారని గా అన్నారు. "హిందువులు ఎన్ని దేవతలను నమ్ముతారు? మూడు కోట్లా? అంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారు? పెళ్లి చేసుకోకుండా ఉండేవారికి హనుమంతుడు ఉన్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకునేవారికి మరొక దేవుడు ఉన్నాడు. మందు తాగేవారికి ఒక దేవుడు ఉన్నాడు. కోడి కోసేవారికి ఎల్లమ్మ, పోచమ్మ, మహిషమ్మ వంటి దేవతలు ఉన్నారు. పప్పన్నం తినేవారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ప్రతి గ్రూపుకు తన సొంత దేవుడు ఉన్నాడు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, హిందూ మత విశ్వాసాలను తేలికగా తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

Continues below advertisement

ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను గాయ పరుస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతూ, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.