CM Revanth Future City Dreams: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను  ఫ్యూచర్ స్టేట్ అని ప్రకటించారు. తర్వాతా  ఫ్యూచర్ సిటీని ప్రకటించారు.  2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన భారీ ప్రణాళికలు ప్రకటించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచ్ సిటీ ఇందులో ముఖ్యమైనవి. కానీ ఈ ప్రాజెక్టులు దేంట్లోనూ అడుగు ముందుకు పడలేదు.  ముచ్చెర్ల పల్లి ప్రాంతంలో 30,000 ఎకరాల్లో  ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని  విదేశీ పర్యటనల్లో ప్రచారం చేశారు.  పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావాలని కోరారు. కానీ ఇప్పటికీ అక్కడ పెద్దగా పురోగతి కనిపించడం లేదు. 

Continues below advertisement

సమగ్ర ప్రణాళిక కరవు 

ఫ్యూచర్ సిటీని 30వేల ఎకరాల్లో రేవంత్ ప్రకటించారు కానీ ఇప్పటి వరకూ మాస్టర్ ప్లాన్ లేదు. దీనికి కారణం పూర్తి స్థాయిలో భూసేకరణ జరగకపోవడమే. గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములతో ప్రస్తుతానికి కొన్ని కేటాయింపులు చేశారు. కానీ రేవంత్ భారీ ప్రణాళిక ప్రకారం ఇంకా భారీగా భూములు సేకరించాల్సి ఉంది. అలా సేకరించాలంటే రైతులకు అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చూపించాలని అనుకుంటున్నారు.అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి  వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముగింపులో భాగంగా ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

Continues below advertisement

ఇన్వెస్టర్ల వద్ద ఫ్యూచర్ సిటీ ప్రమోషన్

హైదరాబాద్‌లో ఎలాంటి ప్రతిష్టాత్మకమైన సమావేశం అయినా  హైటెక్స్ లేకపోతే మరో  అదే స్థాయి  కన్వెన్షన్‌లోనో నిర్వహిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు.  హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి..అందుకే నాలుగో సిటీగా.. ఫ్యూచర్ సిటీని ప్లాన్  చేస్తున్నానని.. తరచుగా చెప్పేవారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు వస్తే.. ముందుగా  ఫ్యూచర్ సిటీనే ఆప్షన్ గా  చెప్పేవారు. ఇప్పుడు అక్కడ కొన్ని సంస్థలకు భూముల కేటాయింపులు అయ్యాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధారాటీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీని నిర్మిస్తున్నారు.  ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు.  మరో సైబరాబాద్‌లా మార్చాలని కోరిక హైదరాబాద్  మరో వైపు విస్తరించాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు.  10 సంవత్సరాల్లో 'న్యూయార్క్'లా మారేలా చేస్తామని చెబుతున్నారు.  ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడం, నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ భారీ సంస్థల పెట్టుబడుల ప్రకటన రాలేదు. సీఎం  సింగరేణి కాలరీస్ ను  10 ఎకరాల్లో  కార్పొరేట్ గ్లోబల్ ఆఫీస్ నిర్మించాలని ఆదేశించారు . వాటితో పాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలే కార్యాలయాలు నిర్మించనున్నాయి. కానీ ఇప్పటి వరకూ అక్కడ ప్రైవేటు సంస్థల పెట్టుబడుల గురించి పెద్దగా ప్రకటనలు రాలేదు. 

రేవంత్ నేల విడిచి సాము చేస్తున్నారా?

అమరావతితో పాటు గుజరాత్, కర్ణాటకల్లో కూడా ఇలా ప్రత్యేక సిటీలు కట్టే ప్రణాళికలను అక్కడి ప్రభుత్వాలు అమలు చేసుతన్నాయి. రేవంత్ కూడా అలా ఓ సిటీని నిర్మించాలని అనుకుంటన్నారు.  అక్కడ ఇంకా ఏమీ లేకపోయినా ఇన్వెస్టర్ల  ఘనంగా సదస్సు నిర్వహించి భవిష్యత్ లో అక్కడే ఓ గొప్ప నగరం ఉండబోతోందని ఆయన పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేందుకు గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఆయన ఫలితాలు విజయవంతం అవ్వాలంటే ముందుకు ఫ్యూచర్ సిటీకి అవసరమైన భూములు సేకరించాలి. మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలి. కానీ ముందుగానే రేవంత్ ఫ్యూచర్ సిటీని ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సక్సెస్అవుతుందో మాత్రం అంచనా వేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.