Telangana CM Revanth Reddy: నీటి కేటాయింపులపై కేసీఆర్​ చేసిన సంతకం తెలంగాణ కొంప ముంచిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  విమర్శించారు. గురువారం ప్రజాభవన్​ లో ప్రజా ప్రతినిధులకు కృష్ణా, గోదావరి బేసిన్​ అంశాలపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇచ్చాడు. దీని సీఎం హాజరై అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్​, చంద్రబాబు సీఎంలు అయ్యాకా నీటి అంశాలపై చాలా ఇబ్బందులు వచ్చాయని..  కృష్ణా నికర జలాలకు సంబంధించి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు.  అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, రెండు రాష్ట్రాల సీఎంల చర్చలలో 34:66 నిష్పత్తికి కేసీఆర్​ ఒప్పందం చేసుకున్నారన్నారు. తొలుత ఒక సంవత్సరానికి అని చెప్పి ఆ తర్వాత వరుసగా పొడిగిస్తూ 2020లో ట్రిబ్యునల్ ఫైనల్ చేసేంత వరకూ ఇదే ఫార్ములా ఉంటుందని కేసీఆర్​ సంతకం చేశారని  వివరించారు.  దీంతో శాశ్వతంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందని రేవంత్ మండిపడ్డారు.  

Continues below advertisement

2004లో ఏర్పడిన  ట్రిబ్యునల్ విచారణకు సంబంధించి 2026 వచ్చినా తీర్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒప్పందంతో ఏపీకి మంచి అవకాశంగా కలిసొచ్చినట్లయిందని.. దీంతో ఈ నీటిపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నారని వెల్లడించారు. ఇ పరివాహక ప్రాంతం ఎంత ఉంటుందో అంత మేరకు నీట వాటా దక్కాలన్నది అంతర్జాతీయ సూత్రం అని చెప్పారు. దీని ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు  కావాలని చెప్పామన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించాల్సింది పోయి.. శ్రీశైలం నుంచి తీసుకునేందుకు డిజైన్ మార్చారన్నారు. దాని వల్ల తీవ్ర నష్టం జరిగిందని..ఎత్తిపోతల నిర్మిస్తేనే కమిషన్లు వస్తాయని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 

అసెంబ్లీ, లోక్​ సభ ఎన్నికలల్లో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడిపోయిందని.. వరుస ఓటములతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్​ గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా మళ్లీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జలవివాదాలు సృష్టించి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే సంకుచిత స్వభావం ప్రతిపక్షాల్లో కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, కృష్ణా-గోదావరి జలాల విషయంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు తాము ప్రయత్నిస్తుంటే, దానిపై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. 2014 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కేటాయింపులపై లోతైన విశ్లేషణ చేశారు. గత పదేళ్లలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. "మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇందులో ఎటువంటి జాప్యం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని, విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, రాష్ట్ర పురోగతిని అడ్డుకునేలా ఉండకూడదని ఆయన సూచించారు.

Continues below advertisement

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పానన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదన్నారు.అయినప్పటికీ తాము అన్ని డాక్యుమెంట్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించారు.