Telangana Graduate MLC Election :   ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని  సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.  ఉన్నత విద్యావంతులు, యువకులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.   
ఒక వ్యాపారం చెడిపోతే ఆ వ్యాపారి మాత్రమే నష్టపోతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ శరీరానికి మాత్రమే నష్టం కానీ.  రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థ పరులు, మోసగాళ్ళు ఉంటే మాత్రం మొత్తం సమాజమే చెడిపోయే ప్రమాదం ఉందన్నారు.  కాబట్టి, ఉన్నత విద్యావంతులు, నిజాయితీ పరులు, ప్రజాసేవ పట్ల అంకితభావం గల యువత రాజకీయాల్లోకి రావాలి. రాణించాలి అని తపనపడే వారిలో నేనూ ఒకర్ని అని  జేడీ లక్ష్మినారాయణ చెప్పారు. 
 
ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి బిట్స్ పిలాని లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారని లక్ష్మినారాయణ గుర్తు చేశారు.  గోల్డ్ మెడల్ కొట్టి, అమెరికాలో కోట్లు సంపాదించే కొలువులు కాదని ప్రజాసేవ కోసం వచ్చారని అలాంటి నిజాయితీ పరులకు అండగా నిలవాలన్నారు.  ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై గల ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి ఒక మంచి భవిష్యత్ నాయకుడిని  గెలిపించాలని కోరారు.                    


జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం   ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు. తాను స్వయంగా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేశారు. పోలింగ్ అయిపోయిన తర్వాత  కౌంటింగ్ సన్నాహాల్లో ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ తరపున నిలబడినా ఉన్నత విద్యావంతులు, మంచి వ్యక్తులకు ఆయన మద్దతు ప్రకటిస్తూ ఉంటారు. రాకేష్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారని అందుకే మద్దతు ప్రకటిస్తున్నానని జేడీ లక్ష్మినారాయణ చెబుతున్నారు. 


ఏనుగుల రాకేష్ రెడ్డి అమెరికాలో కూడా ఉద్యోగం చేసి తిరిగి వచ్చి.. రాజకీయాల్లో రాణిస్తున్నారు. మొదట ఆయన  బీజేపీలో చేరారు. వేగంగా ఆ పార్టీలో ఎదిగారు. అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు టి్కెట్ వస్తుందని అనుకున్నారు. వరంగల్ నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశించినా రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సరిగ్గ్గాసరిపోతారన్న ఉద్దేశంతో ఆయననే ఎంపిక చేశారు కేసీఆర్. రాకేష్ రెడ్డి జేడీ లక్ష్మినారాయణ వంటి వారి నుంచి  మంచి సపోర్ట్ లభిస్తోంది.