Rahul praises Revanth on caste census: ఢిల్లీలో జరిగిన కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు వర్క్ షాప్ లో ఇచ్చిన ప్రజెంటేషన్ సమయంలో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్రసంసించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారన్నారు.  కులగణన నిర్వహించడం అంత తేలిక కాదు..రేవంత్‌రెడ్డి విజయవంతంగా సర్వే చేపట్టారున్నారు.  దేశంలో తెలంగాణ కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. తర్వాత మాట్లాడిన రాహుల్ గాంధీ కూడా.  దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేసినందుకు సోనియా గాంధీ తనను   మెచ్చుకుంటూ లేఖ రాశారన్నారు.   ఈ లేఖ నాకు ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువ అన్నారు.   ఎవరికైనా దీన్ని తెలంగాణ మోడల్ ఆఫ్ కుల గణన అని పిలవడంలో ఇబ్బంది ఉంటే మీరు దీనిని RaRe Model పిలవవచ్చునని పేరు కూడా పెట్టారు. 

అవసరమైతే జంతర్మంతర్లో ధర్నా చేస్తామని..  మీరు పార్లమెంట్లో బిల్లుల ఆమోదం కోసం పోరాడాలని రాహుల్ , ఖర్గేని కోరారు.  మేడం సోనియా గాంధీ రాసిన లేక నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిదని..  సోనియాగాంధీ ఇచ్చిన రాష్ట్రంలో రాహుల్ గాంధీ చెప్పిన హామీని అమలు చేసి చూపెట్టామన్నారు. రాహుల్ గాంధీ మనసులో ఉంది చేసి చూపించాను.. తెలంగాణ లో జరిగిన కుల గణన పూర్తి పారదర్శకంగా జరిగింది.. ప్రతి ఒక్కరూ తమ వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు.  తెలంగాణలో చేసిన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బిల్ చేసి పంపించామని..  స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు చేశామన్నారు. గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించాం.. మూడు నెలలుగా రాష్ట్రపతి ఆమోదం చేయలేదన్నారు.  తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు.    

 సామాజిక న్యాయం కోసం కులగణన ఒక కీలక ఆయుధమని రాహుల్ గాంధీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.  ఈ ప్రక్రియ ద్వారా దేశంలోని వివిధ సామాజిక వర్గాల జనాభా, వారి ఆర్థిక స్థితిగతులను ఖచ్చితంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. - బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం  రిజర్వేషన్ అందించే తెలంగాణ బిల్లును ఆయన సమర్థించారు. దీనిని జాతీయ స్థాయిలో చర్చించాలని కోరారు.   తెలంగాణలో కులగణనను విజయవంతంగా అమలు చేసిన విధానాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో సామాజిక న్యాయాన్ని సాధించవచ్చన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రజంటేషన్‌ను ఆయన హైలైట్ చేశారు.  ఇది ఇతర రాష్ట్రాలకు ఒక బ్లూప్రింట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తోందని, దళితులు, బీసీలు, మైనారిటీల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ   సామాజిక న్యాయ ఎజెండాకు మద్దతుగా నిర్వహించారు.  రాహుల్ గాంధీ ఈ సమావేశంలో తెలంగాణ మోడల్‌ను ప్రశంసిస్తూ, దీనిని జాతీయ స్థాయిలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎంపీలకు.. మల్లు భట్టి విక్రమార్క కూడా పలు అంశాలపై వివరించారు.