Police reveal key details about IBomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ-బొమ్మ పైరసీ కేసులో నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలను పోలీసులు  బయట పెట్టారు.  సైబర్ క్రైమ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్   శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. రవి భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశామని వార్తలు వస్తున్నాయని, ఆమెను కూడా ప్రశ్నించినట్లుగా ప్రచారం చేస్తున్నారని అవన్నీ తప్పేనని పోలీసులు స్పష్టం చేశారు. తామే ఐబొమ్మ రవి వ్యవహారాలను ట్రాక్ చేసి.. పట్టుకున్నామన్నారు. 

Continues below advertisement

ఈజీ మనీకి అలవాటు పడి ఇరవై కోట్లకుపైగా సంపాదన     

ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ ద్వారా హోస్ట్ చేసినట్లు, డొమైన్‌ను ‘ఎన్‌జిల్’ కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేసిన రవి, ఈజీ మనీకి అలవాటు పడి రూ.20 కోట్ల వరకు సంపాదించాడని వెల్లడి చేశారు. అలాగే, లక్షల డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడని, ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని  ఏడీసీపీ తెలిపారు.  పైరసీ దర్యాప్తు సంక్లిష్టమైనదని, వెబ్-3 టెక్నాలజీతో భవిష్యత్తులో పట్టుకోవడం మరింత కష్టమవుతుందన్నారు.  ఇప్పటికీ మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పలు పైరసీ సైట్లు నడుస్తున్నాయని, వాటి నిర్వాహకులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

Continues below advertisement

విదేశీ పౌరుడైనా ఇక్కడ నేరం చేస్తే చర్యలు తీసుకునే అవకాశం        

ఇమంది రవి ఐ-బొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్ల ద్వారా తెలుగు సినిమాలు పోస్ట్ చేసేవాడు. ఆ వెబ్‌సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసి, యూజర్లను గేమింగ్, బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ చేసేవాడు. ఇది పైరసీతో పాటు మరో నేరానికి దారితీసింది.  రవి ఒంటరిగా ఉండి, వారానికి దేశం తిరిగేవాడని, ఈజీ మనీ అలవాటు పడ్డాడని చెప్పారు. "లక్షల ఆ అమెరికన్ డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడు. ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. మా చట్టాల ప్రకారం, విదేశీయులు ఇక్కడ నేరం చేస్తే అది నేరమే. అప్పగింతపై పలు దేశాలతో మా ఒప్పందాలు ఉన్నాయన్నారు.           

రవి స్నేహితుడు నిఖిల్ ను ట్రాక్ చేయడంతోనే దొరికిన రవి                           రవి వెబ్‌సైట్ల పోస్టర్లు డిజైన్ చేసిన నిఖిల్ అనే వ్యక్తి గురించి కూడా ప్రస్తావించారు.  నిఖిల్ పోస్టర్లు డిజైన్ చేసేవాడని అతనితో లావాదేవీలను ట్రాక్ చేసనప్పుడు అసలు విషయం తెలిసిదన్నారు.  మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్‌ తయారు చేస్తున్నాడు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బును యాడ్‌ బుల్ అనే కంపెనీకి మళ్లించాడు రవి. యాడ్‌ బుల్‌ కంపెనీ రవికి చెందినదే. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుంది. ఐ-బొమ్మ వంటి సైట్లు పైరసీతో పాటు బెట్టింగ్, గేమింగ్ నేరాలకు దారితీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.