Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?

Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును పోలీసులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు.ఉదయమే విదేశాల నుంచి వచ్ిచన ఆయన వెంటనే పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Continues below advertisement

Phone tapping case Shravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు  బయటపడినప్పుడు ఆయన విదేశాలకు వెళ్లారు. ఆ తర్వాత అరెస్టు భయంతో తిరిగి రాలేదు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించిది. అరెస్టు  చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించే రెండు రోజుల్లో ఇండియాకు వచ్చి విచారణకు హాజరు అవుతారని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు  హైదరాబాద్ పోలీసులు వెంటనే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం ఆయన పోలీసు ఎదుట హాజరు కావాల్సి ఉండటంతో శనివారం ఉదయమే ఆయన విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Continues below advertisement

ఆరు గంటల పాటు శ్రవణ్  రావును పోలీసులు ప్రశ్నించి పంపేశారు.  మళ్లీ పిలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే ఆయనకు అరెస్టు నుంచి రక్షణ ఉంది. ఓ న్యూస్ చానల్ యజమానిగా ఉన్న ఆయన ట్యాపింగ్ విషయంలో కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. సర్వర్ ఐ న్యూస్ ఆఫీసులోనే పెట్టారని  పోలీసు అభియోగం. వీటన్నిటితో పాటు  ట్యాపింగ్ పరికరాలను సేకరించడం దగ్గర నుంచి ఇతర విషయాలపై ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన ఏం సమాధానం ఇచ్చారో స్పష్టత లేదు. విదేశాలకు పారిపోవడానికి కారణంపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.  
  
మరో నిందితుడు ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ ఇస్తే తాను కూడా విచారణకు హాజరవుతానని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ వాయిదా పడింది. రిలీఫ్ లభిస్తే ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. రిస్క్ ఎందుకని ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రవణ్  రావు ఏదైనా  కీలక సమాచారం ఇచ్చి ఉంటే.. ట్యాపింగ్ కేసులో మరో అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. 

ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులు చాలా కాలం జైల్లో ఉన్నారు. డీఎస్పీ ప్రణీత్ రావు  అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశానని  పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.   ఈ సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ వరకూ అందరికీ అందజేశాననని  కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశానని తెలిపారు. . చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్స్ పై నిఘా పెట్టాను. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చా. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాలతో మొత్తం డేటాను ధ్వంసం చేశానని సెల్ ఫోన్స్, హార్డ్ డిస్కులతో పాటు వేలాదిగా పత్రాలు ధ్వంసం చేశానని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. 

 

Continues below advertisement