Gunpark bandi sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద దీక్ష మొదలుపెట్టారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరిన బండి.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాలులు అర్పించి దీక్ష ప్రారంభించారు. దీంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉధృతి నెలకొంది. పోలీసులు బారీగా బలగాలను మోహరించి బీజేపీ కార్యకర్తలను అదుపుచేస్తున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి పేర్కొన్నారు.
గ్రూప్ 1 ప్రశ్నా పత్రం లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. పేపర్ లీక్ పై ఇంత జరుగుతున్నా నోరు మెదపని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రశ్నించారు. సీఎం.. పేపర్ లీక్ పై తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి బీజేపీ కార్యకర్తలంతా ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్ లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన ఏవీఎన్ రెడ్డి బీజేపీకీ స్పూర్తి, ఆదర్శం అని బండి అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని బండి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి టీచర్లే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
బండి సంజయ్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. గన్ పార్క్ ను చుట్టుముట్టి బండి సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే బండి సంజయ్ చుట్టూ మహిళా కార్యకర్తలు ఉండటంతో మహిళా పోలీసుల్ని కూడా పెద్ద ఎత్తున పిలిపిచి వారిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీక్ష స్థలం వద్ద నుంచి వెళ్లిపోవాలని అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు పోలీస్ గో బ్యాక్.... కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా దీక్ష నుండి కదిలేది లేదని కార్యకర్తలు స్పష్టం చేశారు. అరెస్ట్ చేయడం కష్టం కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతోందని.. బండి సంజయ్ అక్కడ్నుంచి వెల్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తున్నామని బండి సంజయ్ పోలీసులకు తెలిాపరు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న తమపై బలవంతపు చర్యలొద్దని కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బండి సంజయ్ హెచ్చరించారు.