By: ABP Desam | Updated at : 29 Dec 2021 07:34 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత రెండు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 29) దాదాపు 2 వారాల తర్వాత మార్పు కనిపించింది. పెట్రోల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.107.96 అయింది. డీజిల్ ధర రూ.0.25 పైసలు పెరిగి రూ.94.39 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.50 పైసలు తగ్గి రూ.109.53 గా ఉంది. డీజిల్ ధర రూ.0.47 పైసలు తగ్గి రూ.95.85 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.85 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18 గా ఉంది. ఇది రూ.0.79 పైసలు తగ్గింది.
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు పెరిగి రూ.110.65 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.96.69గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
తిరుపతిలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు భారీగా పెరిగింది. లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.0.86 తగ్గింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.111.32 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.76 పైసలు పెరిగి రూ.97.28 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 28 నాటి ధరల ప్రకారం 76.10 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: జనవరిలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు
Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్
Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా